నాని, సుధీర్‌ల ‘వి’ టీజర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Nani and Sudheer babu V movie teaser date locked
Nani and Sudheer babu V movie teaser date locked

(Nani and Sudheer babu V movie teaser date locked and also check V movie star cast and first look posters..) నేచురల్‌ స్టార్‌ నాని 25వ చిత్రం ‘వి’. ఇందులో నాని రాక్షసుడి తరహా పాత్రలో కనిపించనున్నారు. ఆయన దగ్గర నుండి అందరినీ కాపాడే పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో మరో హీరో సుధీర్‌బాబు నటిస్తున్నారు. ఇటీవల వీరిద్దరి పాత్రలకు సంబంధించిన లుక్స్‌ను విడుదల చేసిన చిత్రయూనిట్‌ ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఉన్న పోస్టర్‌ను విడుదల చేసింది. సుధీర్‌బాబు స్టైలిష్‌ లుక్‌తో కనపడుతుంటే.. నాని మెలితిప్పిన మీసాలతో రగ్డ్‌ లుక్‌లో కనపడుతున్నారు. నానితో అష్మాచమ్మా, జెంటిల్‌మన్‌..సుధీర్‌ సమ్మోహనం వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్‌ మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నారు. అదితిరావు హైదరి, నివేదాథామస్‌ హీరోయిన్స్‌. ఈ చిత్రానికి బాక్గ్రౌండ్ స్కోర్ థమన్ చేయబోతున్నారు.

చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా శరవేగంగా నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మాణంలో శిరీష్‌, హర్షిత్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నారు. అలాగే సినిమాను ఉగాది సందర్భంగా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్‌ చేస్తున్నారు.

న‌టీన‌టులు:
నాని, సుధీర్‌బాబు, నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
మ్యూజిక్‌: అమిత్ త్రివేది
నేపధ్య సంగీతం: థమన్.S
సినిమాటోగ్ర‌ఫీ: పి.జి.విందా
ఎడిటింగ్‌: మార్తాండ్ కె.వెంక‌టేశ్‌
నిర్మాత‌లు: రాజు, శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి