Dasara Business Details: నాని ప్రస్తుతం దసరా మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నాని కెరీర్ లోనే అతి పెద్ద సినిమాగా తెరకెక్కుతున్న ఈ దసరా సినిమా ఇప్పుడు ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుపుకుందని తెలుస్తుంది.
అందుతున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఆల్రెడీ నాని కెరీర్ లో మోస్ట్ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుండగా థియేట్రికల్ బిజినెస్ కూడా ఆ లెవెల్లోనే జరుగుతున్నట్టుగా సమాచారం. నాన్ థియేటర్ అంతా కలిపి 50 కోట్ల మేరకు బిజినెస్ (Dasara business) చేశారంట.
అలాగే ఓవర్ సీస్ మినహా మిగిలిన థియేటర్ హక్కులను 27 కోట్లకు అమ్మేసారు సమాచారం తెలుస్తుంది. టోటల్ గా దాదాపు 75 కోట్ల మేరకు సినిమా బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇక కంటెంట్ కూడా క్లిక్ అయితే మాత్రం డెఫినెట్ గా మంచి వసూళ్లు ఈ సినిమా సెట్ చేస్తుంది అనడంలో సందేహం లేదు.
కీర్తి సురేష్ ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు ఓడెల శ్రీకాంత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘దసరా’ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది.
నాని మాస్ గెటప్, టెర్రిఫిక్ అవతార్ ప్రేక్షకులని ఆశ్చర్యపరిచింది. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది.