హీరో నాని ఎమోషనల్ కామెంట్స్!

0
483
Nani Emotional Comments on Tuck Jagadish Trailer Launch

Nani Tuck Jagadish : హీరో నాని తన ‘టక్ జగదీష్’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాడని తెలిసిన వెంటనే ఎగ్జిబిటర్లు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 10న అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా విడుదలకానుంది బుధవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదలచేశారు. ఆ తరువాత విషయం సద్దుమణిగింది. తాజాగా ఈ విషయంపై నాని రియాక్ట్ అయ్యాడు.

‘థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో సినిమాను విడుదలచేస్తున్నందుకు నన్ను కొందరు విమర్శించారు. వారిపై నాకు ఎంతో గౌరవముంది. నేను వారి కుటుంబంలో ఓ సభ్యుడిగానే భావిస్తున్నా. కాసేపు నన్ను తమ కుటుంబం నుంచి వెలివేశారనే బాధ తప్పితే విమర్శించినవారిపై నాకు ఎలాంటి కోపం లేదు’ అని అన్నారు నాని.

హీరో నాని మాట్లాడుతూ ‘అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధాలు, ఉమ్మడి కుటుంబాల్లోని ఆప్యాయతలతో తెలుగు తెరపై సినిమా వచ్చి చాలాకాలం అవుతోంది. ఆ లోటును భర్తీ చేసే సినిమా ఇది. చిన్నతనం నుంచి చూస్తూ పెరిగిన సినిమాల తాలూకు జ్ఞాపకాల్ని తిరిగి గుర్తుకుతెస్తుంది.

Nani and Ritu Varma Tuck Jagadish Trailer Launch Photos

సినిమాను ఓటీటీలో విడుదల చేస్తుండటం పట్ల కొందరు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు నన్ను విమర్శించారు. వారున్న పరిస్థితుల్లో అలా మాట్లాడటం తప్పు కాదు. నా సినిమాలను ఆపేస్తామన్నారు. బయటి పరిస్థితులు బాగున్నప్పుడు కూడా నా సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయలేనిపక్షంలో వారు నన్ను బ్యాన్‌ చేయడం కాదు. నన్ను నేనే బ్యాన్‌ చేసుకుంటా. అన్ని కోణాల్లో ఆలోచించి ఓటీటీలో విడుదలచేస్తున్నాం’ అని తెలిపారు.