గ్యాంగ్ లీడర్ కి కొత్త టెన్షన్

0
146
Nani, Gang leader , Cast Crew, Tollywood Movie News

Nani, Gang leader , Cast Crew, Tollywood Movie News

 

అనిరుథ్…తమిళ్ లో తిరుగులేని యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్.100 కోట్ల క్లబ్ మూవీస్ కూడా అనిరుథ్ ఖాతాలో ఉన్నాయి.కానీ తెలుగులో మాత్రం అనిరుథ్ కి ప్రతి సారి చుక్కెదురవుతుంది.అజ్ఞాతవాసి లాంటి గ్రాండ్ ఎంట్రీ డిజాస్టర్ గా మారింది.ఎన్టీఆర్ అరవింద సమేత చేజారింది.జెర్సీ మంచి సినిమా అనిపించుకున్నా,అనిరుథ్ కి పేరు వచ్చినా గుర్తుండిపోయే విజయం అయితే దక్కలేదు.

కానీ ఇప్పుడు నాని,విక్రమ్.కె.కుమార్ ల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న గ్యాంగ్ లీడర్ అనిరుథ్ కి రైట్ ఆప్షన్.కానీ ఆ సినిమాలో ఉన్న నాలుగు పాటల్లో ఇప్పటివరకు కేవలం ఒకే ఒక ట్యూన్ ఇచ్చి యూనిట్ ని టెన్షన్ పెడుతున్నాడట.గ్యాంగ్ లీడర్ కి ఆల్రెడీ రిలీజ్ డేట్ ఇచ్చేసారు.దగ్గర దగ్గరగా రెండు నెలలు మాత్రమే టైం ఉంది.సాంగ్స్ ని లాస్ట్ మినిట్ వరకు బ్యాలన్స్ పెట్టుకుంటే నష్టమేకానీ లాభం ఉండదు.అయితే ఈ సినిమాకి ఏరికోరి మరీ అనిరుథ్ ని పెట్టుకున్నాడు విక్రమ్.కె.కుమార్.దీని వెనుక నాని రికమండేషన్ కూడా ఉంది.అందుకే ఇద్దరూ కూడా గట్టిగా మాట్లాడలేకపోతున్నారు.వేరే డెసిషన్ తీసుకోలేకపోతున్నారు.

మిగతా తెలుగు సినిమాల విషయంలో కూడా అనిరుథ్ ఇలా వ్యవహరించడం వల్లే అతనికి తెలుగులో అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు అని అంటున్నారు.థమన్ లాంటి వాళ్ళు టైం బ్యాండ్ కి లోబడి పనిచెయ్యబట్టే షైన్ అయ్యారు.అనిరుథ్ మాత్రం క్వాలిటీ అంటూ సాగదీస్తూ పోతే ఇలానే ఉంటుంది పరిస్థితి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here