Nani, Karthikeya, Gang Leader Movie, Gang Leader Review, Latest News
Nani, Gang Leader Movie, Gang Leader Movie Review, Latest News

విడుదల తేదీ : సెప్టెంబరు 13, 2019
రేటింగ్ : 3.5/5
నటీనటులు : నాని,కార్తికేయ, ప్రియాంకా అరుళ్ మోహన్,లక్ష్మీ, శరణ్య, ప్రియదర్శి, వెన్నెల కిషోర్
దర్శకత్వం : విక్రమ్ కుమార్
నిర్మాత‌లు : నవీన్ ఎర్నేని, ఎర్నేని రవి మరియు మోహన్ చెరుకూరి
సంగీతం : అనిరుధ్ రవి చంద్రన్
సినిమాటోగ్రఫర్ : మీరోసలా క్యూబా బ్రోజెక్
ఎడిట‌ర్‌ : నవీన్ నూలి

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నేచ్యురల్ స్టార్ నాని నటించిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయకిగా నటించగా ‘ఆర్ఎక్స్100’ ఫేమ్ కార్తికేయ ప్రతినాయకుడి పాత్ర పోషించడం జరిగింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం.

కథ :

ఒక బ్యాంక్ రోబరితో ఈ సినిమా మొదలవుతుంది. ఆ రోబరి కారణంగా అనాధలుగా మిగిలిన మొత్తం ఐదుగురు ఆడవాళ్లు పెన్సిల్ పార్ధ సారథి (నాని)ని తమ గ్యాంగ్ కు లీడర్ గా ఉండాలని కోరుతారు. అయితే సినిమాలు చూసి క్రైమ్ నవల్స్ రాస్తూ ఉండే పెన్సిల్ పార్ధ సారథి ఆ ఆడవాళ్ళ గ్యాంగ్ కు ఎలా “గ్యాంగ్ లీడర్”గా మారాడు ? ఈ గ్యాంగ్ అంతా తాము చంపాలని తిరుగుతున్న వ్యక్తే దేవ్ (కార్తికేయ) అని ఎలా తెలుసుకుంటారు. దాంతో దేవ్ ని చంపడానికి వాళ్ళు ఎలాంటి ప్రయత్నం చేస్తారు ? ఇంతలో నాని ఆ గ్యాంగ్ లోని ప్రియా (ప్రియాంక అరుల్ మోహన్)తో ఎలా ప్రేమలో పడతాడు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం సినిమా అనుకుని మలుపులు తిరుగుతుంది ? ఇంతకీ ఈ కథకి కార్తికేయ(దేవ్)కు ఉన్న సంబంధం ఏమిటి అసలు వీళ్ళు దేవ్ ని చంపారా? లేదా? అనేదే మిగితా కథ.

నటీనటులు :

ఇక నటీనటుల విషయానికి వస్తే.. నాచురల్ స్టార్ నాని ఎప్పటిలానే తన పెర్ఫామెన్స్ తో సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా పెన్సల్ పార్ధ సారథి అనే పాత్రలో నాని రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటాడు. అలాగే కొన్ని కీలక సన్నివేశాల్లో మరియు కొన్ని కామెడీ సన్నివేశాల్లో నాని కామెడీ టైమింగ్ అద్భుతంగా అనిపిస్తోంది. ఇక మరో ప్రధాన పాత్రలో కనిపించిన కార్తికేయ కూడా అద్భుతమైన నటన కనబర్చారు. అలాగే ‘నాని మరియు హీరోయిన్ ప్రియంకా’ల మధ్య సీన్స్ లో ప్రియాంక మంచి నటన కనబర్చారు. గ్యాంగ్ లో కనిపించిన మిగతా సీనియర్ నటులు కూడా తమదైన నటనతో ఆకట్టుకుంటారు. ముఖ్యంగా లక్ష్మీ, శరణ్య వెన్నెల కిషోర్ తమ నటనతో మెప్పిస్తారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు తగ్గట్లు చాల బాగా నటించారు.

టెక్నీషియన్స్:

దర్శకుడు విక్రమ్ కే కుమార్ టీజర్ మరియు ట్రైలర్లతోనే సినిమా పై అంచనాలు పెంచేశారు. ఆ అంచనాలకు తగ్గట్లుగానే విక్రమ్ కె కుమార్ మరోసారి తన మార్క్ ను చూపిస్తూ గ్యాంగ్ లీడర్ తో సూపర్ హిట్ అందుకున్నాడు. తాను రాసుకున్న కథ మరియు దాన్ని తెరకెక్కించిన విధానం ఒక కొత్త కథను చూసిన ఫీలింగ్ ను కలిగించాడు. అలాగే నాని మరియు కార్తికేయ పాత్రలను ఎక్కడా కూడా తగ్గించకుండా విక్రమ్ తెరకెక్కించిన తీరు చాలా బాగుంది.

అయితే దర్శకుడు సినిమాని ఇంట్రస్టింగ్ గా మొదలు పెట్టినా.. ఆ తరువాత కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా సాగుతుంది. ట్రీట్మెంట్, ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ.. కొన్ని కీలక సీన్స్ లో లాజిక్ మిస్ అవ్వడం దీనికి తోడు సెకెండ్ హాఫ్ స్లోగా సాగుతూ అక్కడక్కడ బోర్ కొడుతోంది. సంగీత దర్శకుడు అనిరుద్ అందించిన నేపధ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ బాగుంది గాని, సెకండాఫ్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా ఉంది. ప్రేమ సన్నివేశాల్లోని విజువల్స్ ను ఆయన చాలా సహజంగా చూపించారు.

నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు చాల బాగున్నాయి. మొత్తంగా దర్శకుడు మంచి కామెడీ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకున్నా.. కొన్ని సన్నివేశాల్లో పూర్తి స్థాయిలో ఆకట్టుకులేకపోయారు. ముఖ్యంగా కార్తికేయ పాత్రకి సంబదించి ఇంకా క్లారిటీగా చూపించి ఉంటే బాగుండేది. అయితే సినిమాలో ఉన్న బలమైన ఎమోషనల్ రివేంజ్ కంటెంట్ ను కూడా బాగా ఎలివేట్ చేశారు. దీనికితోడు సెకెండ్ హాఫ్ లో హీరో చుట్టూ సాగే డ్రామా బలంగా ఉండటం.. సినిమాలో ఫుల్ ఫన్ ఉండటం సినిమాకి బాగా ప్లస్ అయింది.

తీర్పు :

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నేచ్యురల్ స్టార్ నాని హీరోగా భారీ అంచనాల మధ్యన వచ్చిన ఈ చిత్రం హీరో క్యారెక్టరైజేషన్ మరియు అతని చుట్టూ సాగే డ్రామా మరియు ఐదుగురు ఆడవాళ్ళ ఎమోషన్ అలాగే కొన్ని కామెడీ సన్నివేశాలు సినిమాలో బాగా ఆకట్టుకుంటాయి. పైగా నాని తన పెర్ఫార్మెన్స్ తో సినిమాని మరో లెవల్ కి తీసుకువెళ్ళాడు. ముఖ్యంగా తన కామెడీ టైమింగ్ తో బాగా నవ్వించాడు. మొత్తం మీద సినీ అభిమానులకు ఈ చిత్రం బాగా నచ్చుతుంది.