Nani, Gang Leader Movie, USA Collections, Box office, Telugu latest News
Nani, Gang Leader Movie, USA Collections, Box office, Telugu latest News

నేచురల్‌ స్టార్‌ నాని, డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌ లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకం పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మించిన విభిన్న చిత్రం ‘నాని’స్‌ గ్యాంగ్‌ లీడర్‌’. కాగా ఈ సినిమా ఈ రోజే విడుదల అయిన సంగతి తెలిసిందే. ఫస్ట్ షో నుండి మంచి పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ చిత్రంగా నిలిచింది ఈ సినిమా. కాగా అప్పుడే ఈ సినిమా ప్రీమియర్ షోల కలెక్షన్స్ బయటకు వచ్చేశాయి. యూఎస్ లో మొత్తం 177 లొకేషన్స్ లోని ప్రీమియర్ షోల నుండి $182,679 డాలర్స్ ను సాధించింది. మొత్తానికి నాని గ్యాంగ్‌ లీడర్‌ తో మంచి అందుకున్నాడు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన చెన్నై బ్యూటీ ప్రియాంకా అరుళ్ మోహన్ ఈ హిట్ తో టాలీవుడ్ లో ఎంతవరకూ నెట్టుకొస్తోందో చూడలి. అలాగే ఇటీవలే గుణ అంటూ మరో ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్న ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ నెగిటివ్ రోల్ లో ఓ హిట్ అందుకున్నాడు. సరికొత్త కంటెంట్ తో రివేంజ్ డ్రామాతో సాగే కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో లక్ష్మి, శరణ్య, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, సత్య నటించారు. ఈ చిత్రానికి యంగ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మ్యూజిక్ అందించారు.