nani latest project shyam singha roy regular shoot begins from december

Shyam Singha Roy: Nani: టాలీవుడ్‌లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ కూడగట్టుకున్న నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలను లైన్‌లో పెట్టేశారు. ప్రస్తుతం ‘టక్ జగదీష్’ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ మూవీ షూటింగ్ ఫినిష్ కాగానే తన తదుపరి సినిమా ‘శ్యామ్ సింగరాయ్’ స్టార్ట్ చేయబోతున్నారు నాని. శ్యామ్ సింఘరాయ్ పోస్టర్ ని తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ లో షేర్ చేశారు.

నాని – సాయిపల్లవి- కృతి శెట్టి ప్రధాన తారాగణంగా టాక్సీవాలా ఫేం రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్స్ సినిమాపై ఆసక్తి రేకెత్తించాయి. గతంలో ఏ సినిమాలో కనిపించని డిఫరెంట్ రోల్ పోషించనున్నారట నాని. తాజాగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ గురించిన అప్‌డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ ఏడాది డిసెంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. దసరా సందర్భంగా సింఘరాయ్ టీమ్ శుభాకాంక్షలు తెలిపింది.

nani latest project shyam singha roy regular shoot begins from december

ప్రస్తుతం ఈ పోస్టర్ నాని అభిమానుల్లో వైరల్ గా మారింది. నాని ఈ మూవీ కోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ స్వీకరించింది. ఈ బ్యానర్ నుంచి ప్రొడక్షన్ నెంబర్ 1 గా ఈ మూవీ రూపొందనుంది. మెలోడీ మ్యాజిక్ చేసే మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చనున్నారు.