Nani Next Syam Singaray huge set in hyderabad

నాని (Nani) 25వ సినిమా ‘వి’ విడుదలకు సిద్దం అయ్యింది. మరో మూడు రోజుల్లో ఆ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో వైపు నాని కొత్త సినిమా శ్యామ్ సింఘరాయ్ (Syam Singaray) కూడా పట్టాలెక్కబోతుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ మూవీ లో హీరో నాని రెండు డిఫరెంట్ రోల్స్ లో నటించనున్నట్టు సమాచారం. ఈ మూవీ లో నాని కి జోడీగా సాయి పల్లవి నటించే అవకాశం ఉంది.

ఈ సినిమా కథానుసారం ఎక్కువ కథ కలకత్తాలో జరుగబోతుంది. అది కూడా 20 ఏళ్ల క్రితం కలకత్తా పరిసరాల్లో జరగాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితులలో కోల్ కతా లో షూటింగ్ సాధ్య పడదు కనుక కోల్ కతా సెట్ ను హైదరాబాద్ లో రూపొందించి చిత్రీకరణ జరపాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కనుక కాస్త ఇబ్బంది రిస్క్ తో కూడుకున్నది అయినా కూడా పాత కలకత్తా కాళిని మరియు పరిసర ప్రాంతాలను హైదరాబాద్ అల్యూమీనియం ఫ్యాక్టరీలో నిర్మించబోతున్నారు.

గత వారం రోజులుగా అల్లూమీనియం ఫ్యాక్టరీలో షూటింగ్ కోసం సెట్టింగ్ నిర్మాణం జరుగుతోంది. వచ్చేనెల రెండవ లేదా మూడవ వారం నుండి అక్కడ చిత్రీకరణ జరుపుతారని తెలుస్తోంది. జూన్ మొదటి వారం లో మూవీ షూటింగ్స్ ప్రారంభమైతే నాని ముందుగా “టక్ జగదీష్ ” మూవీ షూటింగ్ కంప్లీట్ చేయాల్సిఉంది. తరువాత “శ్యామ్ సింగ రాయ్ “మూవీ సెట్స్ పైకి వెళుతుంది. ఈ మూవీ తరువాత సక్సెస్ ఫుల్ “బ్రోచేవారెవరురా ” మూవీ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో ఒక మూవీ, సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ దర్శకత్వంలో ఒక మూవీ కి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.