ఫైనల్ షెడ్యూల్ Nani ‘శ్యామ్‌ సింగరాయ్‌’

0
22
Nani Shyam Singh Roy on set for final schedule

Nani Shyam Singha Roy: నాని హీరోగా ‘ట్యాక్సీవాలా’ ఫేం రాహుల్‌ సాంకృత్యన్‌ తెరకెక్కిస్తున్న చిత్ర ‘శ్యామ్‌ సింగరాయ్‌’. ఇందులో ముగ్గురు అందమైన కథానాయికలు సాయి పల్లవి కృతి శెట్టి – మడోన్నా సెబాస్టియన్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. లాక్‌డౌన్‌కి ముందే అధికభాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో గురువారం shooting పునః ప్రారంభమైంది.

సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో రూపొందించిన కోల్‌కతా సెట్‌లో నానితోపాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొన్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ నాని లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో ఖాకీ దుస్తుల్లో ఉన్న నాని బ్యాక్ సైడ్ లుక్ కనిపిస్తోంది. అతని చుట్టూ ఉన్న జనాలు చేతుల్లో త్రిశూలాలు పట్టుకొని ఉన్నారు. యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు ఆ ఫొటో చూస్తుంటే అర్థమవుతోంది.

ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ పూర్తి చేసుకుని, త్వరలోనే ప్రేక్షకుల్ని అలరించనుంది. కాగా ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. నాని కెరీర్లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.  ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్‌ సంగీతం అందిస్తున్నారు.