ఉగాదికి నాని ‘శ్యామ్ సింగ రాయ్’ టీజర్

388
Nani Shyam Singha Roy Teaser to Release for Ugadi
Nani Shyam Singha Roy Teaser to Release for Ugadi

నాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఉగాది సందర్భంగా విడుదల కానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన శ్యామ్ సింగరాయ్ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది.

 

 

కలకత్తా నగరం నేపథ్యంలో బ్రిటీష్ కాలంలో ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది. ఒక వింటేజ్ డ్రామాలా అనిపిస్తుంది శ్యామ్ సింగరాయ్. ఇక ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్స్ సాయి పల్లవి, కృతి శెట్టిలతో పాటు మరో టాలెంటెడ్ నటుడు నటిస్తున్నాడు. అతడే బెంగాళీ నటుడు జిష్షు సేన్ గుప్తా.ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.

 

 

నాని.. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ అనే సినిమా చేస్తున్నాడు. మొదటి నుంచి మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఆ పోస్టర్ ను చూస్తే మాత్రం ఓ క్లాస్ అండ్ పవర్ ప్యాక్డ్ గా ఉందని చెప్పొచ్చు.

 

 

ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 16న విడుదల చేయనున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. థమన్ సంగీతం అందిస్తుండగా సన్ షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్నారు. రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాని ఈ మూవీతో పాటు ‘బ్రోచే వారెవరురా’ ఫేమ్‌ వివేక్‌ ఆత్రేయతో ‘అంటే.. సుందరానికి..’ అనే ఓ అడల్ట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ని చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఇటీవల ప్రీలుక్ కూడా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.