‘వి’ మూవీ నుండి వస్తున్నా వచ్చేస్తున్నా రెండో సాంగ్

Nani, Sudheer Babu V Movie Songs and video songs

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వి’. నివేదా థామస్, అతిథిరావు హైదరి కథానాయికలు. ఇందులో సుధీర్ బాబు రక్షకుడిగా, నాని రాక్షసుడిగా కనిపించబోతున్నారు. ఉగాధి కానుకగా ఈ నెల 15న ‘వి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్రబృందం. రెండో సాంగ్ ‘చూస్తున్నా చూస్తునే ఉన్నాను విడుదల చేశారు.

ఈ సాంగ్‌లో నాని, సుధీర్‌బాబు, నివేదా థామస్‌లు కనపడుతున్నారు. నానికి ఇది 25వ చిత్రం. ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందించిన ఈసినిమాలోని ఈ పాటను ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయగా.. శ్రేయా ఘోషల్‌, అమిత్ త్రివేది, అనురాగ్ కులకర్ణి ఈ ఆలపించారు. డైరెక్టర్‌ మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నారు. అదితిరావు హైదరి, నివేదాథామస్‌ హీరోయిన్స్‌.