nani, sudheer babu v telugu movie trailer talk

నాని, సుధీర్ బాబు హీరోలుగా రూపొందుతున్న V మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌లో కట్ చేసిన అన్ని సన్నివేశాలు సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చాయి. నాని కెరీర్లో 25వ చిత్రంగా వస్తున్న ఈ మూవీలో అదితి రావ్ హైదరి – నివేత థామస్ లు హీరోయిన్స్ గా నటించారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ – హర్షిత్ రెడ్డి నిర్మించారు.

తాజాగా V ట్రైలర్ విడుదల చేసి ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను రెట్టింపు చేశారు మేకర్స్. ఈ ట్రైలర్‌లో యాక్షన్ సన్నివేశాలతో పాటు నాని చెబుతున్న పదునైన డైలాగ్స్ సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేశాయి. ఏ పని చేసినా సరే ఎంటర్‌టైనింగ్‌గా చేయాలనేది నా పాలసీ అంటూ నాని సీన్‌తో స్టార్ట్ చేసిన సన్నివేశాలను.. మళ్ళీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మ్యాచ్ అవలేదన్న మాట రాకూడదు అంటూ నాని చెప్పిన డైలాగుతోనే ముగిస్తూ ఈ ట్రైలర్ కట్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే V ప్రేక్షకులకు యాక్షన్‌తో సరికొత్త ఫన్ అందించబోతోందని తెలుస్తోంది.

ఇక ‘వి’ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందించారు. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడు. సినిమాటోగ్రాఫర్ పీజీ విందా అద్భుతమైన విజువల్స్ అందించినట్లు తెలుస్తోంది. జగపతిబాబు – వెన్నెల కిశోర్ – నాజర్ – అవసరాల శ్రీనివాస్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంతో నాని మొదటిసారిగా విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ రోల్ పోషిస్తున్నాడు. హీరోయిన్లు నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి రోల్స్ సినిమాకు స్పెషల్ అసెట్ కానున్నాయని సమాచారం. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ స్ట్రీమింగ్ కి పెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.