ఏప్రిల్23న నాని టక్ జగదీష్

0
99
nani-tuck-jagadeesh-movie-releasing-on-april23rd
nani-tuck-jagadeesh-movie-releasing-on-april23rd

బాక్స్ ఆఫీస్ వద్ద ఇద్దరు హీరోలు పోటీ పడటం అంత తొందరగా జరగదు. అటువంటిది ఈ సారి వరుసగా బాక్సాఫీస్ వద్ద యుద్దాలు జరగనున్నాయి. భారీ బడ్జెట్ పెట్టి చేసిన సినిమాలతో పోటీ పడటం చాలా రిస్క్‌తో కూడుకున్న పని, అలాగే సరైన సమయంలో విడుదల చేయకపోయిన రిస్క్ అవుతుందని చెప్పాలి. అందుకనే ఒక సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడానికి అనేక చర్చలు చోటుచేసుకుంటాయి.

 

 

అయితే ఇటీవల నాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ సినిమా, నాగచైతన్య, నాచురల్ బ్యూటీ సాయిపల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమాలు ఏప్రిల్16న విడుదలకు సిద్దమయ్యాయి. లవ్ స్టోరీ కన్నా నాని సినిమా ముందుగా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు. కానీ నాగచైతన్య పోటీకి రావడంతో ఎవరు వెనక్కితగ్గుతారని ప్రేక్షకులు ఆసక్తిగా చూశారు. అయితే ఈ రెండు సినిమాలు భారీ అంచనాలతో తెరకెక్కుతున్నాయి. ఇటువంటి సమయంలో పోటీ అనవసరం అనుకొని నాని సినిమా నిర్మాతలు వెనక్కి తగ్గారు. టక్ జగదీష్ సినిమా విడుదల తేదీని ఏప్రిల్16 నుంచి మార్చారు.

 

 

లాక్‌డౌన్ తరువాత సినిమాలు వరుసగా విడుదల కావడంతో పోటీ అనవసరం అని సినిమా సినిమాకి వారం రోజుల గ్యాప్ ఉండేలా చూసుకుంటున్నారు. ఇదే తరహాలో టక్ జగదీష్ సినిమాను ఏప్రిల్23న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. మరి ఈ నిర్ణయం ఈ రెండు సినిమాలకి ఎంత ఉపయోగపడుతుందో వేచి చూడాలి.