“టక్ జగదీష్” ట్రేండింగ్.. ట్రైలర్ కు ముహుర్తం ఖరారు..!

0
1064
Nani Tuck Jagadish Trailer tomorrow

Tuck Jagadish: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతిబాబు, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేశ్, రావు రమేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇంకొన్ని రోజుల్లో నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కి రెడీగా ఉంది.

‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుండగా నాని గత చిత్రం “వి” కి ఏ తరహా ప్రమోషన్స్ సోషల్ మీడియాలో మరియు ఓటిటి లో జరిగాయో అదే రీతిలో అంతకు మించే విధంగా ఈ సినిమాకి కూడా జరుగుతున్నాయి.

ఈ సినిమా ట్రైలర్‌ ను రేపు సాయంత్రం 5 గంటల సమయంలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ ను కూడా రిలీజ్‌ చేసింది. మొదటి రోజే సాధ్యమైనంత వరకు భారీ ఎత్తున వ్యువర్స్ ని అందుకోవాలని చూస్తున్నారేమో కానీ ప్రైమ్ వీడియో సహా పలు ఓటిటి హ్యాండిల్స్ మరియు టాలీవుడ్ కి చెందిన సినీ పి ఆర్ ఓ లు కూడా తమ హ్యాండిల్స్ కి టక్ యాడ్ చేస్తున్నారు. కాగా… ఈ సినిమా సెప్టెంబర్‌ 10 న ఓటీటీ వేదికగా విడుదల అవుతోంది.

 

Previous articleVarudu Kaavalenu Teaser
Next articleఈడీ ముందు హాజరైన పూరీ జగన్నాథ్‌..!