అఫీషియల్‌: ఓటీటీలోనే నాని 25వ సినిమా

0
201
Nani V Movie Will Entertain On Amazon Prime And Release Date Fix

మోహన కృష్ణ ఇంద్రగంటి రచించి , దర్శకత్వం వహించిన ఈ తెలుగు థ్రిల్లర్ లో ‘నేచురల్ స్టార్’ నానీ ప్రధాన పాత్రలో నటించారు. సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావు హైదరి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

భారత్ మరియు 200 దేశాలు, టెరిటరీస్ లలో ప్రైమ్ సభ్యులు ఎక్స్ క్లూజివ్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోపై సెప్టెంబర్ 5న విడుదలయ్యే ‘వి’ తెలుగు టైటిల్ డిజిటల్ ప్రీమియర్ ను చూడవచ్చు.

తాజా మరియు ప్రత్యేకమైన చలనచిత్రాలు, టీవీ కార్యక్రమాలు, స్టాండ్-అప్ కామెడీ, అమెజాన్ ఒరిజినల్స్, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ ద్వారా ప్రకటనరహిత సంగీతం, భారతదేశపు అతిపెద్ద ఉత్పత్తుల ఎంపికపై ఉచిత ఫాస్ట్ డెలివరీ, టాప్ డీల్స్ కు ప్రారంభ ప్రాప్యత, ప్రైమ్ రీడింగ్‌తో అపరిమిత పఠనం, ప్రైమ్ గేమింగ్ తో మొబైల్ గేమ్ కంటెంట్ తో ప్రైమ్ అద్భుతమైన విలువను అందిస్తుంది. అన్నీ నెలకు రూ.129 లకు మాత్రమే.

అమెజాన్ ప్రైమ్ వీడియో నేడిక్కడ మోహన కృష్ణ ఇంద్రగంటి రచించి , దర్శకత్వం వహించిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ ‘వి’ అంతర్జాతీయ ప్రీమియర్ ను ప్రకటించింది. ఈ తెలుగు థ్రిల్లర్ లో ‘నేచురల్ స్టార్’ నానీ ప్రధాన పాత్రలో నటించారు. సుధీర్ బాబు, నివేత థామస్, అదితి రావు హైదరి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. భారత్ మరియు 200 దేశాలు, టెరిటరీస్ లలో ప్రైమ్ సభ్యులు ఎక్స్ క్లూజివ్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోపై సెప్టెంబర్ 5న విడుదలయ్యే ‘వి’ తెలుగు సినిమా డిజిటల్ ప్రీమియర్ ను చూడవచ్చు.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, ‘‘యాక్షన్ థ్రిల్లర్స్ ను నేను ఎంతగానో ఇష్టపడుతాను. అలాంటి థ్రిల్లర్స్ లో ఒకటి ‘‘వి’’. ఇది థ్రిల్ ను, నాటకీయతను, వేగవంతమైన యాక్షన్ ను అందిస్తుంది. సుధీర్ బాబు, నేను నటిం చిన పాత్రల మధ్య జరిగే ఎలుకా- పిల్లి ఆట నేను ఈ సబ్జెక్ట్ పై దృష్టి పెట్టేలా చేసింది. ‘వి’ అంతర్జాతీయ ప్రీమి యర్ పై నేనెంతో ఉద్వేగంగా ఉన్నాను. సినీ పరిశ్రమలో ఇది నా 25వ సినిమా.200 దేశాలు, టెరిటరీస్ లలో‘వి’ ని ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రైమ్ వీడియోలో చూసే అవకాశం నా అభిమానులకు, మద్దతుదారులకు కలిగింది. వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకునేందుకు ఇంతకు మించిన మార్గం మరొకటి లేదు. ఓ ఆసక్తిదాయక అం శం ఏమిటంటే… నా మొదటి సినిమా విడుదల అయిన రోజే….అంతర్జాతీయంగా ఈ సినిమా ప్రదర్శన జరుగ నుంది…అదే సెప్టెంబర్ 5’’ అని అన్నారు.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా డైరెక్టర్, కంటెంట్ హెడ్ విజయ్ సుబ్రమణియం మాట్లాడుతూ, ‘‘వివిధ భాష ల్లో, రకాల్లో తాజా వినోదాన్ని అందించడం మరియు అత్యుత్తమ ప్రతిభావంతులతో కలసి పని చేయడంలో మేం ముందుకు సాగుతున్నాం. తెలుగు సినిమా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందించింది. అవి ప్రేక్షకులకు వినో దాన్ని అందించడం మాత్రమే గాకుండా ఎంతో ముఖ్యమైన సామాజిక సందేశాలను సైతం అందించాయి. మా సే వలకు సంబంధించి తెలుగు కంటెంట్ మరియు తెలుగు వీక్షకులు ఎంతో ముఖ్యమైనవి. యాక్షన్ తో నిండిన, వి జువల్లీ స్టన్నింగ్ ఎంటర్ టెయినర్ అయిన ‘వి’ని మా ప్రేక్షకులకు అందించడం మాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. తెలుగు సినీ ప్రముఖుల్లో నాని ఒకరు. ఆయన తాజా సినిమా ‘వి’ని అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా అంతర్జా తీయంగా ప్రదర్శించడం మాకెంతో ఆనందదాయకం’’ అని అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, ‘‘జాను, ఎఫ్ 2, ఎంసీఏ, మహర్షి, సరిలేరు నీకెవ్వరు లాంటి చిత్రాలకు అపూర్వ స్పందన పొం దాం. ఇవన్నీ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. భారత్ లో మాత్రమే కాదు, విదేశాల్లో సైతం వినియోగదారులకు మా కంటెంట్ ను వినియోగదారులకు అందించడంలో ప్రైమ్ వీడియో గొప్ప భాగస్వామిగా ఉంటోంది. భాషాపరమైన, భౌగోళికపరమైన హద్దులను అధిగమించడంలో వారు తోడ్పడ్డారు. కంటెంట్ ను చూసి ఆనందించడంలో స్టోరీ టెల్లింగ్ కీలకపాత్ర పోషిస్తోంది. ‘వి’ గ్లోబల్ ప్రీమియర్ తో మా అనుబంధాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లడం మాకెంతో ఆనందదాయకం. ఇది యాక్షన్ తో నిండిన థ్రిల్లర్. నాని ఇందులో ప్రధానపాత్ర పోషించారు. సుధీర్ బాబు ,నివేదా థామస్, అదితి రావు హైదరి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని మేం విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.

కథా సారాంశం: క్రైమ్ రచయిత్రితో ప్రేమలో పడిన ఓ పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ ‘వి’. సాల్వ్ చేయాల్సిందిగా ఓ పజిల్ ఇస్తూ ఓ హంత కుడు చేసే సవాళ్లతో …ప్రశాంతంగా సాగుతున్న ఆ పోలీస్ జీవితం కాస్తా తలకిందులవుతుంది. దిల్ రాజు, శిరీ ష్, హర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మోహన కృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అమి త్ త్రివేది సంగీతం అందించారు. నేచురల్ స్టార్ నాని, నివేదా థామస్, సుధీర్ బాబు, అదితి రావు హైదరి ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here