Homeట్రెండింగ్సమీక్ష : నాని ‘వి’ ఆకట్టుకోలేకపోయింది

సమీక్ష : నాని ‘వి’ ఆకట్టుకోలేకపోయింది

Movie: Nani V Telugu review
Chitrambhalare Rating : 2.75/5
నటీనటులు : నాని, నివేదా థామస్, సుధీర్ బాబు, అదితి రావ్ హైదరి, జగపతి బాబు తదితరులు.
రచన,దర్శకత్వం : మోహన్ కృష్ణ ఇంద్రగంటి
నిర్మాత : దిల్ రాజు
సంగీతం : అమిత్ త్రివేది

నాని, (Nani) హీరో సుధీర్ బాబు (Sudheer Babu) కలయికలో టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘వి’. అదితి రావ్ హైదరి, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. కాగా తాజాగా ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ

ఆర్మీలో పని చేసిన విష్ణు (నాని) ఇన్స్ పెక్టర్ ప్రసాద్ అనే అతన్ని చంపి మరో నలుగురును చంపుతా దమ్ము ఉంటే ఆపు అని డీసీపీ ఆదిత్యతో ఛాలెంజ్ చేస్తాడు. అప్పటికే సూపర్ కాప్ గా డీసీపీ ఆదిత్య (సుధీర్ బాబు) గ్యారెంటీ మెడల్ తో డిపార్ట్మెంట్ లోనే వెరీ సక్సెస్ ఫుల్ ఆఫీసర్ గా పేరుప్రఖ్యాతులు తెచ్చుకుంటాడు. ఈ క్రమంలోనే అపూర్వ (నివేధా) అతని కథ రాయడానికి వచ్చి అతనితో ప్రేమలో పడుతుంది. ఆదిత్య, విష్ణు హత్యలు చేయకుండా ఆపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసాడు ? ఈ హత్యలకు సాహెబా (అదితి రావ్ హైదరి)కి సంబంధం ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

నాని ఈ సినిమాలో కూడా తన పాత్రకు తగ్గట్లు… ఎప్పటిలాగే తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఇలాంటి క్లిష్టమైన పాత్రలో నాని నటించిన విధానం సినిమాకే హైలెట్ అనిపిస్తోంది. ముఖ్యంగా ఇలాంటి క్లిష్టమైన పాత్రలో నాని నటించిన విధానం సినిమాకే హైలెట్ అనిపిస్తోంది. నాని విలనిజానికి ధీటుగా ఉండే ఒక డీసీపీ పోలీస్ ఆఫీస‌ర్ హీరోయిజాన్ని సుధీర్‌బాబు కూడా అంతే సీరియస్ టోన్ లోనే పలికించాడు. అలాగే సెకెండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ కి ముందు వచ్చే కీలక సన్నివేశాలతో పాటు సుదీర్ బాబు క్యారెక్టర్ తో సాగే ట్రాక్ లో గాని, క్లైమాక్స్ సన్నివేశంలో గాని నాని తన టైమింగ్ తో అద్భుతంగా నటించాడు.

- Advertisement -

ఇక కీలక పాత్రల్లో నటించిన హీరోయిన్స్ ‘అదితి రావ్ హైదరి’, ‘నివేదా థామస్’ అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకున్నారు. అయితే దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ రాసుకున్న ట్రీట్మెంట్ కొన్ని చోట్ల ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక నాని, సుధీర్ బాబు మ‌ధ్య నువ్వా నేనా? అనేలా వ‌చ్చే యాక్ష‌న్ అండ్ ఛేజింగ్ స‌న్నివేశాలు సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

అలాగే ఇద్దరి హీరోల లవ్ ట్రాక్స్ కూడా వీక్ గా ఉన్నాయి. క్రైమ్ కథలు రాయడానికి వచ్చిన ఒక కాలేజీ టాపర్ నివేధా మరీ సిల్లీగా లవ్ లో పడిపోవడం, దానికితోడు అమెగారు రీసెర్చ్ చేసే విధానం మరీ కామెడీగా అనిపిస్తుంది..మొత్తానికి ఇంద్రగంటి సినిమాని ఇంట్రస్టింగ్ గా మొదలు పెట్టినా.. కథనంతో సినిమాని నెమ్మదిగా సాగతీస్తూ మధ్యమధ్యలో యాక్షన్ పెట్టి నెట్టుకొచ్చాడు. అలాగే ఫస్టాఫ్ లో వచ్చే ల్యాగ్ సీన్స్ ను కూడా తగ్గించుకుని ఉండి ఉంటే, సినిమాకి ఇంకా బెటర్ అవుట్ ఫుట్ వచ్చి ఉండేది.

తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ కూడా బాగాలేదు. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా ఉంది. నిర్మాత దిల్ రాజు పాటించిన నిర్మాణ విలువలు చాల బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

నాని నటన
సుధీర్ బాబు క్యారెక్టర్
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

కథాకథనాలు,
సీన్స్ స్లోగా సాగడం
కొన్ని చోట్ల లాజిక్ మిస్ అవ్వడం.

తీర్పు :

భారీ అంచనాలతో మల్టీస్టారర్ గా వి అంటూ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం కథాంశం పరంగా అలాగే యాక్షన్ పరంగా ఆకట్టుకున్నా..ఓవరాల్ గా సినిమా మాత్రం ఆకట్టుకోలేకపోయింది. కథకథనాలు బాగా స్లోగా సాగుతూ సినిమా బోర్ గా కొడుతొంది. అలాగే కొన్ని సీన్స్ ఆసక్తికరంగా సాగకపోవడం, మరియు కొన్ని చోట్ల ప్లే కూడా స్లోగా సాగడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా అనిపిస్తాయి. నాని అభిమానులతో పాటు యాక్షన్ లవర్స్ కు తప్ప.. ఇక మొత్తానికి ఈ చిత్రం ఏ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకోదు.

For the latest Telugu movie news, entertainment exclusives, gossip, movie reviews, and more, follow the Chitrambhalare website and YouTube channel, or head to our social media platforms like Twitter, Facebook, Instagram!

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY