Homeసినిమా వార్తలునాని, మృణాల్ ఠాకూర్ Nani30 గ్రాండ్ గా ప్రారంభం

నాని, మృణాల్ ఠాకూర్ Nani30 గ్రాండ్ గా ప్రారంభం

Nani's new movie Nani30 launched with a pooja ceremony.. Nani 30 cast crew, Nani 30 shooting location and update, Nani 30 shooting date

Nani new movie Nani 30 grand launch: నేచురల్ స్టార్ నాని 30వ చిత్రానికి నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించనున్నారు. మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై భారీ ఎత్తున, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించనున్నారు. ఈ సినిమా ఈరోజు హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది.

Nani new movie Nani 30 grand launch: ముహూర్తం షాట్‌కు మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌ కొట్టగా.. అశ్వినీదత్ కెమెరా స్విచాన్ చేశారు. బుచ్చిబాబు, కిషోర్ తిరుమల, హను రాఘవపూడి, వశిష్ట, వివేక్ ఆత్రేయ కలిసి తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు. అంతకుముందు విజయేంద్ర ప్రసాద్ ప్రొసీడింగ్స్ ప్రారంభించడానికి మేకర్స్‌కి స్క్రిప్ట్‌ను అందజేశారు.

పలాస కరుణ్ కుమార్, గిరీష్ అయ్యర్, దేవకట్టా, చోటా కె నాయుడు, సురేష్ బాబు, దిల్ రాజు, 14 రీల్స్ గోపి- రామ్ ఆచంట, ఎకె అనిల్ సుంకర, మైత్రి రవి, డివివి దానయ్య, స్రవంతి రవి కిషోర్, కెఎస్ రామారావు, సాహు గారపాటి, ఏషియన్ సునీల్, అభిషేక్ అగర్వాల్, నిహారిక కొణిదెల, కళ్యాణ్ దాసరి తదితరులు ఈ ప్రారంభోత్సవ వేడుకకు అతిథులుగా హాజరయ్యారు.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపు హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో నానికి జోడిగా నటించనున్నారు. ఈ చిత్రంలో కొంతమంది ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సాను జాన్ వర్గీస్ ISC డీవోపీగా, హృదయం ఫేమ్‌ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందించనున్నారు.

Nani 30 cast: నాని, మృణాల్ ఠాకూర్

Nani 30 crew :
దర్శకుడు: శౌర్యువ్
నిర్మాతలు: చెరుకూరి మోహన్, డాక్టర్ విజయేందర్ రెడ్డి, మూర్తి కలగర
బ్యానర్: వైర ఎంటర్‌టైన్‌మెంట్స్
డీవోపీ: సాను జాన్ వర్గీస్ ISC
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
ప్రొడక్షన్ డిజైనర్: జోతిష్ శంకర్
ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఈవీవీ సతీష్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – భాను ధీరజ్ రాయుడు
కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ

For the latest Telugu movie news, entertainment exclusives, gossip, movie reviews, and more, follow the Chitrambhalare website and YouTube channel, or head to our social media platforms like Twitter, Facebook, Instagram!

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY