Tuck Jagadish: ‘టక్‌ జగదీశ్‌’కు ఓటీటీ భారీ ఆఫర్‌..!

0
23
Nani's Tuck Jagadish gets a big OTT deal

Nani Tuck Jagadish OTT: నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా తెరకెక్కిన కుటుంబ కథాచిత్రం ‘టక్‌ జగదీశ్‌’. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదల విషయంలో ఎప్పటి నుంచో సందిగ్ధత కొనసాగుతోంది. పూర్తిస్థాయి కమర్షియల్‌ హంగులతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 23న విడుదల చేయాలని చిత్రబృందం తొలుత భావించింది. ఈ సినిమా కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడింది.

అయితే ఇప్పుడు థియేటర్స్ తెరుచుకుంటున్నా ఈ సినిమా విడుదలపై క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో సినిమా విడుదలపై పలు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదల కానుందని సమాచారం.

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోతో ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ డీల్ ఫైనల్ స్టేజిలో ఉందని అంటున్నారు. దీని కోసం ప్రైమ్ వారు 37 – 40 కోట్ల మధ్య చెల్లిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఓటీటీ విడుదల విషయంలో చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.

‘నిన్నుకోరి’ తర్వాత శివ-నాని కాంబోలో తెరకెక్కుతున్న రెండో చిత్రమిది. రీతూవర్మ కథానాయిక. ఐశ్వర్యా రాజేశ్‌ రెండో కథానాయిక. జగపతిబాబు, నాజర్‌, రోహిణి, నరేశ్‌, రావు రమేష్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. తమన్‌ స్వరాలు అందించారు.