18 Pages Song: నన్నయ్య రాసిన క్లాసీ మెలోడీ తో నిఖిల్..!!

Nannaya Raasina song from 18 Pages movie released: నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న 18 పేజిస్ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇదివరకే రిలీజైన ఈ చిత్ర టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది.

Nannaya Raasina song from 18 Pages movie: తాజాగా “18 పేజిస్” చిత్రం నుండి “నన్నయ్య రాసిన” అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసారు. ఈ పాటను లిరిసిస్ట్ శ్రీమణి రచించారు. 18 పేజిస్ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. “నన్నయ్య రాసిన” పాటను పృథ్వి చంద్ర, సితార కృష్ణ కుమార్ ఆలపించారు.

ఈ నాస్టాల్జిక్ రొమాన్స్‌ని పుష్ప దర్శకుడు సుకుమార్ రాశారు. ఇదివరకే గతంలో కుమారి 21 ఎఫ్ చిత్రంతో హిట్ అందుకున్న పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే కార్తికేయ-2 సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు.

Nannaya Raasina song from 18 Pages movie released
Nannaya Raasina song from 18 Pages movie released

నిఖిల్ సిద్ధార్థ & అనుపమ పరమేశ్వరన్. కృష్ణ తత్వాన్ని, కృష్ణ సారాంశాన్ని చెప్పిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలక్షన్స్ సాధించింది. అంతటి ఘనవిజయం సాధించిన కార్తికేయ- 2 తరువాత అనుపమ పరమేశ్వరన్, నిఖిల్ జంటగా చేస్తున్న చిత్రం కావడంతో ఈ “18 పేజిస్” సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. 18 పేజిస్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 23న క్రిస్టమస్ కానుకగా విడుదల చేయనున్నారు.

 

Related Articles

Telugu Articles

Movie Articles