Homeసినిమా వార్తలురాంగోపాల్ వర్మ వ్యూహం సినిమా పై లోకేష్ ఫిర్యాదు.!

రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమా పై లోకేష్ ఫిర్యాదు.!

Nara Lokesh’s letter puts RGV’s Vyooham Movie in a difficult position, Censor board rejected RGV's Vyooham certified, Vyooham Movie Release date,

Nara Lokesh’s letter puts RGV’s Vyooham Movie in a difficult position, Censor board rejected RGV’s Vyooham certified, Vyooham Movie Release date,

రాంగోపాల్ వర్మ గురించి తెలుగు ఇండస్ట్రీలో కాకుండా బాలీవుడ్ లో కూడా తెలియని వారంటూ ఎవరూ ఉండరు. వివాదాస్పద సినిమాలో తీస్తూ అలాగే పొలిటికల్ గాను ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటారు ఆర్జీవి గారు.. ఇప్పుడు అదే విధంగా వ్యూహం అనే సినిమా తీస్తూ ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారారు మరోసారి. వ్యూహం అనే సినిమాని చాలా రోజుల క్రితం రాంగోపాల్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని ఇటీవల విడుదల చేయడం కూడా జరిగింది. అయితే ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకూడదు అంటూ టిడిపి నారా లోకేష్ సెన్సార్ బోర్డ్ వాళ్లకు లెటర్ రాయడం జరిగింది.

ఈ లేఖలో నారా లోకేష్ “తన తండ్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికి, అగౌరవపరిచేందుకు రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.” CBFC బోర్డు వాళ్లు ఇప్పటికే ఈ వ్యూహం సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరించినట్టు దీనిపై మేకర్స్ కూడా రివైజింగ్ కమిటీని ఆశ్రయించారు.

అయితే దీనికి కాను రివైజింగ్ కమిటీ వాళ్లకు రాసిన లెటర్ ని రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేయడం జరిగింది. తన సినిమాని ఎవరు ఆపలేరు అంటూ కామెంట్ చేశారు. ఆ సినిమాని రెండు భాగాలుగా ప్లాన్ చేశాడు ఆర్జీవీ. నవంబర్ 10న విడుదల కానున్న వ్యుహం మొదటి భాగం. పార్ట్ టూ, శపధం, జనవరి 25, 2024న విడుదల కానుంది.

ట్రైలర్ మరియు పాటలను కూడా విడుదల చేసి, నవంబర్ 10న చిత్రాన్ని విడుదల చేయడానికి అన్ని ప్లాన్‌లు చేసాడు, అయితే సెన్సార్ బోర్డ్ నుండి RGVకి పెద్ద షాక్ వచ్చింది. నారా లోకేష్ రాసిన లెటర్ అలాగే సినిమా కంటెంట్ అభ్యంతరంగా ఉంది అనే కారణంతో సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ రిజక్ట్ చేస్తున్నట్టు తెలియజేశారు. ఇక, వ్యుహం చిత్ర నిర్మాతల అభ్యర్థనపై రివిజన్ కమిటీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY