Homeసినిమా వార్తలుపుష్పలో నందమూరి హీరో ?

పుష్పలో నందమూరి హీరో ?

అల్లు అర్జున్ (Allu Arjun), రష్మిక మందన (Rashmika Mandanna) హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న ‘పుష్ప’ (Pushpa) సినిమాలో మరో హీరో కూడా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ మేరకు సుకుమార్ పక్కా స్కెచ్ వేసి దాన్ని అమలు పరిచేలా సన్నాహాలు ప్రారంభించారట. ఈ మూవీలో అల్లు అర్జున్‌తో తెర పంచుకునేందుకు నందమూరి కాంపౌండ్ నుంచి ఓ హీరోని సెలక్ట్ చేశారని తెలుస్తోంది.

ఈ సినిమా కంటే ముందు వచ్చిన అల వైకుంఠపురములో కూడా హీరోలు నవదీప్, సుశాంత్ హీరోలు కనిపించరు. ఈసారి కూడా మరొకరు కనిపించనున్నారు. అది ఎవరో కాదు నారా రోహిత్ (Nara). అవును ఈ సినిమాలో బన్నీ ఫ్రెండ్ గా నారా రోహిత్ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపింది. బన్నినే స్వయంగా ఆ పేరును సుకుమార్ కి సూచించాడట. ఆ పాత్రకు ప్రాధాన్యత కూడా బాగానే ఉందంట. ఎంతంటే రంగస్థలం లో ఆది పినిశెట్టి పాత్రలా ఈ సినిమాలో ఆ పాత్ర చాలా కీలకంగా ఉంటుందట.

Nara Rohit Will Share The Screen With Allu Arjun Pushpa

ఇకపోతే పుష్పలో కథను మలుపుతిప్పే విలన్ క్యారెక్టర్ కోసం జగపతిబాబును లైన్ లోకి తీసుకొచ్చారని తెలుస్తోంది. ఈయన పాత్ర కూడా సినిమాలో హైలైట్ కానుందని అంటున్నారు. లారీ డ్రైవర్ పుష్పరాజ్ రోల్‌లో బన్నీ నటిస్తుండగా, పల్లెటూరు పిల్లలా డిఫెరెంట్ క్యారెక్టర్ పోషిస్తోంది రష్మిక. అల్లు అర్జున్ కెరీర్‌లో మొట్టమొదటి ప్యాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై బన్నీ ఫ్యాన్స్ ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు.

 

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY