Prathinidhi 2 Shooting Update: సినిమాల నుండి చాలా కాలం విశ్రాంతి తీసుకున్న తర్వాత, నటుడు నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ తో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కొన్ని వారాల క్రితం విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ మరియు వీడియోకు భారీ స్పందన వచ్చింది. ఈ చిత్రం ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
Prathinidhi 2 Shooting Update: ‘ప్రతినిధి 2’ సినిమాకి సంబదించిన రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. షూటింగ్ మొదలు పెట్టినట్టు ఆఫిసిఅల్ గా ఫోటో కూడా విడుదల చేసారు మూవీ టీం నారా రోహిత్‌తో పాటు సినిమాలోని ఇతర ముఖ్య నటీనటులు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లో ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. వన్ మ్యాన్ అన్ని విధాలుగా మళ్లీ నిలబడతాడు” అనేది సినిమా క్యాప్షన్. ‘ప్రతినిధి 2’ సామాజిక సమస్యల నేపథ్యం లో వస్తుంది.
ఈ చిత్రం 25 జనవరి 2024న వస్తుందని మేకర్స్ ప్రకటించారు. మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చగా, మూర్తి దేవగుప్తపు ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహించారు. టాలీవుడ్‌లో రోహిత్‌కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది.
రెగ్యులర్ కంటెంట్‌కు భిన్నంగా సినిమాలు చేస్తారు అందుకని అందరూ రోహిత్ మూవీస్ కోసం ఎదురు చూస్తూ వుంటారు. నారా రోహిత్ తన కథల ఎంపికతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేయగలిగాడు. 5 ఇయర్స్ తరువాత మల్లి కెమెరా ముందుకు రోహిత్ రావటం జరిగింది. మేకర్స్ త్వరలో చిత్ర ప్రధాన నటి మరియు ఇతర నటీనటుల వివరాలను వెల్లడిస్తారు.