Homeరివ్యూస్నరసింహపురం రివ్యూ

నరసింహపురం రివ్యూ

చిత్రం: నరసింహపురం
రేటింగ్: 3/5
సంగీతం : ఫ్రాంక్లిన్ సుకుమార్
ఎడిటర్ : శివ వై. ప్రసాద్
దర్శకత్వం : శ్రీరాజ్ బళ్ళా
నిర్మాతలు : శ్రీరాజ్ బళ్ళా- టి.ఫణిరాజ్ గౌడ్-నందకిశోర్ ధూళిపాల
నటీనటులు : నందకిషోర్, సిరి, ఉషశ్రీ, హనుమంతు, విజయ్ కుమార్, రంగధామ్, రవివర్మ బళ్ళా, సంపత్ తదితరులు ..

నందకిషోర్ మొదటిసారి వెండితెరపై కథానాయకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రీరాజ్ బళ్లా దర్శకత్వంలో ఫణిరాజ్ గౌడ్ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం ఫ్రాంక్లిన్ సుకుమార్. కాగా కల్యాణ మాధవి, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫేమ్ విజయ్ కుమార్, అరవిందసమేత ఫేమ్ రంగధామ్, రవివర్మ బళ్ళా, సంపత్, ఫణిరాజ్, స్వామి ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ ఆయింది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న దారుణాలపై ఓ వ్యక్తి తిరగబడితే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన నరసింహ పురం కథ ఎలా ఉందొ తెలుసుకుందాం !

కథ :

కథలో హీరో నందకిషోర్ ( నంద ) గతం మర్చిపోయి పిచ్చివాడై తిరుగుతుంటాడు. అతన్ని కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది సిరి (సిరి). అసలు ఈ సిరికి నందకిషోర్ కి ఉన్న సంబంధం ఏమిటి ? ఇంతకీ సిరి ఎవరు ? నందని ఎందుకు ఆమె అంత జాగ్రత్తగా చూసుకుంటుంది. అసలు నంద ఎందుకు పిచ్చివాడు అయిపోయాడు ? అతని జీవితం అలా మారడానికి కారణం ఎవరు ?అసలు నంద కుటుంబం ఎక్కడ ఉంది. ఇలాంటి అంశాలు ఏమిటన్నది మిగతా కథ.

విశ్లేషణ:
తానూ ప్రేమించిన అమ్మాయిలో నిజమైన ప్రేమను వెతుకుంటూ.. చివరికీ తను ప్రేమ కోసం జీవితంలో ఎన్నో బాధలు పడతాడు. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాల్లో నందకిశోర్ చాల బాగా నటించాడు. ముక్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకున్నాడు. అలాగే యాక్షన్ సన్నివేశాల్లో కూడా చక్కగా చేసాడు. అలాగే మరో కీలక పాత్రలో నటించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫేమ్ విజయ్ కుమార్ కొన్ని కామెడీ అండ్ సీరియస్ సన్నివేశాల్లో చక్కని పెర్ఫార్మెన్స్ కనబర్చాడు. ముఖ్యంగా తన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ సిరి ఉన్నంతలో తన గ్లామర్ తోను నటనతో ఆకట్టుకుంది. ఇక కీలక పాత్రల్లో నటించిన అరవిందసమేత ఫేమ్ రంగధామ్, రవివర్మ బళ్ళా, సంపత్, ఫణిరాజ్ వారి వారి పాత్రల్లో ఆకట్టుకున్నారు.

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు రాసుకున్న స్క్రిప్ట్ బాగున్నప్పటికీ దాన్ని అమలు పరిచే విధానం బాగుంది. శ్రీరాజ్ బళ్లా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ బాగా ఆకట్టుకుంటుంది. అలాగే నిజమైన ప్రేమ గురించి చెప్పే కొన్ని అంశాలు ఆకట్టుకుంటాయి. ఓ బర్నింగ్ ఇష్యు ని తీసుకుని దానికి రివెంజ్ డ్రామాగా ఎంచుకున్న కథ బాగుంది. అలాగే సంగీత దర్శకుడు ఫ్రాంక్లిన్ సుకుమార్ అందించిన పాటలు బాగున్నాయి, అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ముక్యంగా కొన్ని కీలక సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో బాగా సపోర్ట్ గా నిలిచింది. అలాగే ఎడిటింగ్ క్లీన్ గా ఉంది, సినిమాటోగ్రఫీ బాగుంది. పెల్లెటూరు విజువల్స్ ను అందంగా చూపించారు. ముఖ్యంగా నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

- Advertisement -

తనకు జరిగిన ఓ అన్యాయానికి ఓ వ్యక్తి ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అన్న పాయింటాఫ్ వ్యూ లో కథ సాగింది. ఓ బర్నింగ్ ఇష్యు ని తీసుకుని దర్శకుడు ఆ కథను మలిచిన విధానం బాగుంది. రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్, నందకిషోర్ క్యారెక్టర్ ఆకట్టుకుంటాయి, దర్శకుడు శ్రీరాజ్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. మొత్తానికి నరసింహపురంలో ఏమి జరిగింది అన్న ఆసక్తిని కలిగించేలా సినిమా సాగుతుంది. దర్శకుడు శ్రీరాజ్ రెండు కథలను బాగా డీల్ చేసాడు, స్క్రీన్ ప్లే బాగుంది, ముఖ్యంగా ప్రెజెంట్ ను ఫాస్ట్ ను చూపించే విధానం ఆకట్టుకుంటుంది.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY