Narayana & co movie review & rating: 3/5 – నటీనటులు: సుధాకర్ కోమాకుల, ఆర్తిపొడి, దేవీ ప్రసాద్, ఆమని, పూజ కిరణ్, సప్తగిరి, తోటపల్లి మధు తదితరులు – స్క్రీన్ ప్లే, దర్శకత్వం: చిన్నా పాపిశెట్టి – నిర్మాత: పాపిశెట్టి బ్రదర్స్, సుధాకర్ కోమాకుల
కథ: నారాయణ (దేవి ప్రసాద్), జానకి (ఆమని) మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన భార్యాభర్తలు. నారాయణ బ్యాంకులో క్యాషియర్‌గా వర్క్ చేస్తుండగా.. పెద్ద కుమారుడు ఆనంద్ (సుధాకర్ కోమకుల) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. మరోవైపు క్రికెట్ బెట్టింగ్ అంటే అతనికి పిచ్చి. ఇలా బెట్టింగ్‌లో డబ్బులు పొగొట్టుకుని రూ.10 లక్షల అప్పు చేస్తాడు. నారాయణ చిన్న కొడుకు చిన్న కొడుకు సుభాష్ (జై కృష్ణ) కెమెరామెన్‌గా వర్క్ చేస్తుంటాడు.
ఓ చావు ఇంట్లో ఫొటోలు తీసేందుకు వెళ్లిన సుభాష్.. అక్కడే ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. వారిద్దరు సన్నిహితంగా ఉన్న వీడియోను గుర్తు తెలియని వ్యక్తి తీసి.. రూ.10 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోను వైరల్ చేస్తానని అంటాడు. ఇటు నారాయణ పని చేసే బ్యాంకులో 25 లక్షల రూపాయలు చోరీకి గురవుతుంది. ఈ దొంగతనాన్ని బ్యాంక్ మేనేజర్ నారాయణ మీదకు మోపుతాడు. రూ.25 లక్షలు బ్యాంక్‌లో జమ చేయాలని.. లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తాడు.
నారాయణతోపాటు ఇద్దరు కొడుకులకు కూడా డబ్బులు అవసరం అవ్వడంతో ఎవరినైనా కిడ్నాప్ చేయాలని అనుకుంటారు. నారాయణ మేనకోడలు నళిని (పూజా కిరణ్)తో కలిసి ఓ కిడ్నాప్‌కి ప్లాన్ చేస్తే.. అది ఫెయిల్ అవుతుంది. మరోవైపు పాలిటిక్స్‌లో వచ్చేందుకు రౌడీ శంకర్ (తోటపల్లి మధు) రెడీ అవుతాడు. ముంబైలో ఉన్న ఓ పిల్లి బొమ్మను తీసుకువస్తే.. కోటి రూపాయలు ఇస్తామని నారాయణ కుటుంబానికి ఆఫర్ ఇస్తాడు.
ఈ డీల్‌కు ఒప్పుకున్న నారాయణ & కో.. ముంబైకి వెళ్లి పిల్లి బొమ్మను తీసుకువచ్చిందా..? అక్కడ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది..? ఆ పిల్లి బొమ్మలో ఏముంది..? నారాయణ బ్యాంక్‌లో డబ్బులు ఎత్తుకెళ్లింది ఎవరు..? సుభాష్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తోంది ఎవరు..? ఎస్‌ఐ అర్జున్ (అలీ రెజా) వారిని ఎలా పట్టుకున్నారు..? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలియాలంటే నారాయణ & కో మూవీని చూడాల్సిందే..

విశ్లేషణ: కామెడీ, సస్పెన్స్ అంశాలతో దర్శకుడు చిన్నా పాపిశెట్టి రాసుకొన్న పాయింట్ బాగుంది. దీనిని కథగా మలిచే విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్‌ను బాగా డీల్ చేసాడు, అందుచేత మంచి కామెడీ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా నిలిచింది.ఇక సెకండాఫ్ లో పిల్లి బొమ్మ డ్రామాతో డీల్ చేసిన విధానం బాగుంది.
నటీనటుల ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. నారాయణ అనే పాత్ర చుట్టూ అల్లుకొన్న పాత్రలు కావడంతో దేవీ ప్రసాద్ పాత్ర ప్రధానంగా కనిపిస్తుంది. దేవీ ప్రసాద్ ఫుల్ లెంగ్త్ పాత్రతో ఆకట్టుకొన్నారు. ఆనంద్‌గా సుధాకర్ కోమాకుల ఫెర్ఫార్మెన్స్. బాడీ లాంగ్వేజ్ బాగుంది. ఆయన చూపించిన ఎనర్జీ, డ్యాన్సులు ఆకట్టుకొన్నాయనే చెప్పాలి. సుధాకర్ కోమాకుల ఈ సినిమాను తన యాక్టింగ్‌తో నిలబెట్టాడనే చెప్సాలి. నారాయణ అండ్ కో సినిమాలో సుభాష్‌గా నటించిన జై కృష్ణ మంచి కామెడీ టైమింగ్‌ను చూపించాడు. ఆమని, తోటపల్లి మధు, సప్తగిరి, అలి రెజా తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ఫస్టాఫ్‌లో రెండు పాటలు బాగున్నాయి. పూర్ణాచారి, కాసర్ల శ్యామ్ అందించిన పాటలు బాగున్నాయి. సెకండాఫ్‌లో రాజుల వేషాలతో వేసిన పాట బాగుంది. ఈ పాటకు సినిమాటోగ్రాఫర్ రాహుల్ శ్రీవాస్తవ వాడుకొన్న లైటింగ్ బాగుంది. ఈ సినిమాలోని సన్నివేశాల కోసం రాహుల్ శ్రీవాస్తవ ఉపయోగించిన కలర్ ప్యాటర్న్ సినిమాను రిచ్‌గా మార్చింది. ఫస్టాఫ్‌లో దాదాపు 10 నిమిషాలు, సెకండాఫ్ క్లైమాక్స్‌లో కొంత కత్తిరించాల్సిన అవసరం ఉంది.
చివరిగా: నారాయణ & కో సినిమా ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ ఎంటర్టైనర్