narcotics control bureau officials raids rakul preet singh home in mumbai

NCB Raids Rakul Preet Singh Home : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్ కోణం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.. రియా చక్రవర్తిని పోలీసులు విచారించినప్పుడు ఆమె వాట్సాప్ చాట్ ఆధారంగా డ్రగ్స్ వాడినట్టు గుర్తించారు. దీనిపైన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి ) విచారణ చెప్పట్టింది.. సుశాంత్ మాజీ టాలెంట్ మేనేజర్ జయ సాహాను ఎన్‌సీబీ అధికారులు విచారించినప్పుడు ఆయన పలువురు హీరోయిన్ల పేర్లు చెప్పినట్టు నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలో దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్‌లతో సహా పలువురు ప్రముఖులను దర్యాప్తు కోసం ఎన్‌సిబి అధికారులు పిలిపించారు. అయితే, రకుల్‌కు ఎలాంటి నోటిసులు అందలేని ఆమె టీమ్ మొదట ప్రకటించింది. హైదరాబాద్‌లో కానీ.. ముంబైలో కానీ తనకు ఎన్‌సీబీ పంపిన సమన్లు అందలేని తెలిపింది. ఈ మేరకు రకుల్‌ ప్రీత్‌ మేనేజర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇది జరిగిన కొద్దిసేపటికే తనకి సమన్లు అందాయని, శుక్రవారం విచారణకు హాజరవుతున్నానని రకుల్ వెల్లడించినట్టుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

NCB Raids Rakul Preet's Home After Alleged 'attempt To Misguide' & Her Joining Probe Late

ప్రస్తుత సమాచారం ప్రకారం దీపికా పదుకొనె రేపు (సెప్టెంబర్ 25న).. సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్ శనివారం (సెప్టెంబర్ 26)న ఎన్‌సీబీ ముందు విచారణకు హాజరవుతారు. దీపికా పదుకొనెతో పాటు రకుల్ కూడా రేపే విచారణకు హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు. అయితే గురువారం ముంబైలోని రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఎన్‌సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సమన్లు పంపినా సమాధానం లేకపోవడం, ఈరోజు విచారణకు హాజరుకాకపోవడం వల్లే ఎన్‌సీబీ అధికారులు రకుల్ ఇంట్లో సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది.