Naresh pavitra love story: సీనియర్ నటుడు నరేష్ మరియు పవిత్ర లోకేష్ మధ్య రిలేషన్షిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా ఉన్న టాపిక్. గత కొద్ది కాలంగా వాళ్ళిద్దరి మధ్య నడుస్తున్న విషయాన్ని రకరకాల ఫోటోలు మరియు వీడియోలతో సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టడమే కాకుండా జనాలకు వారి ముదురు ప్రేమాయణంతో పిచ్చి పట్టిస్తున్నారు. నరేష్ కి ఇది ఏకంగా నాలుగవ పెళ్లి అవుతుంది. ఈ క్రమంలో నరేష్ మూడో భార్య వీరిద్దరిపై హోటల్లో దాడి చేసిన ఇన్సిడెంట్ అయితే సోషల్ మీడియాను షేక్ చేసింది.
Naresh pavitra love story: కాస్త వివాదం సద్దుమణిగింది అనుకునే సమయానికి ఇద్దరూ కలిసి మళ్లీ పెళ్లి అనే సినిమా చేస్తున్నారు. విజయ్ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు ఎంఎస్ రాజు వహిస్తున్నారు. ఈ ముదురు జంట ప్రేమ చరిత్ర మళ్లీ పెళ్లి ఈనెల 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ ఈవెంట్స్ లో పాల్గొంటున్న నరేష్ తనకు పవిత్ర పై అట్రాక్షన్ ఎలా కలిగింది అనే విషయాన్ని ఎట్టకేలకు రివీల్ చేశారు.
షూటింగ్ సెట్స్ లో ఫ్యాన్ పక్కన కూర్చున్న పవిత్ర నుంచి వచ్చే గాలిలోని ఫ్రాగ్రామ్స్ నచ్చిన నరేష్ ఆమెతో అదే మాట చెప్పాడంట. దానికి ఆమె ఏదో పెర్ఫ్యూమ్ పేరు చెప్పి నవ్విందట.. కానీ నరేష్ మాత్రం అది కాదు నీ నుంచి వచ్చే ఇంకేదో ఫ్రాగ్రామ్స్ నాకు నచ్చింది అన్నారట.
ఆ తర్వాత కిచెన్ లో సీన్ చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి నా కిచెన్ లో ఉంటే బాగుండేది అనే థాట్ బలంగా అతని బ్రెయిన్ లో నాటుకుందట. ఎట్టకేలకు ఇలాంటి మనిషి నా లైఫ్ లో బాగుంటుంది అన్న ఫీలింగ్స్ బలంగా కలగడంతో నరేష్ పవిత్ర ప్రపోజ్ చేయడం తాను ఎస్ చెప్పడం.. ఈ స్టోరీ అంతా చెప్పుకొచ్చాడు నరేష్.

ఒకరోజు డిన్నర్ కు తీసుకువెళ్లిన తర్వాత నరేష్ ఐ లవ్ యు చెప్తే ఆమె సైలెంట్ గా ఉందంట. తరువాత కారులో దిగి వెళ్తూ కీప్ లవింగ్ ని అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ మాటలకు అర్థం కాని నరేష్ నెక్స్ట్ డే షూటింగ్లో అందరి ముందు ఆమె చేయి పట్టుకొని అడగాలి అనుకుంది ధైర్యంగా అడిగేసాడట.
దానికి పవిత్ర ఈరోజు చెప్తాను అని డిసెంబర్ 31 నైట్ ఎట్టకేలకు నరేష్ లవ్ ని యాక్సెప్ట్ చేసి ఐ లవ్ యు చెప్పిందట. పాపం నరేష్ ఇంటర్వ్యూ అయినప్పటి నుంచి ఈ ముదురు లవ్ స్టోరీ విని కుర్ర కారు బ్యాచిలర్లు తమ పరిస్థితి ఏమిటా అని అయోమయంలో పడిపోయి ఉన్నారు…
Web Title: Naresh Pavitra love story, Naresh explained love on Pavitra, Actor Naresh publicly reveals his love story with Pavitra lokesh details, Pavitra Lokesh thanks Mahesh Babu & Namratha for welcoming her into their family