‘కలర్ ఫోటో’పై నాని ప్రశంసలు

600
Natural Star Nani Praises Colour Photo Movie Team

సుహాస్, చాందిని చౌదరి జంటగా వచ్చిన ‘కలర్ ఫోటో’ సినిమాకు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినా సినీ ప్రముఖులు మాత్రం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’ ద్వారా ఇటీవల విడుదలై ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోన్న ‘కలర్ ఫోటో’ సినిమాపై నేచురల్ స్టార్ నాని ప్రశంసల వర్షం కురిపించారు.

‘‘సందీప్ నాకు ఎప్పటి నుంచో పరిచయం. అతడిని పరిచయం చేయాలనే కోరిక నాకు బలంగా ఉండేది. దాన్ని నేను మిస్సయ్యాను. ‘కలర్ ఫోటో’ చూసిన తరవాత నేను ఎంత మిస్సయ్యానో ఇంకా అర్థమైంది. తనను నమ్మాను, కచ్చితంగా మంచి సినిమా తీస్తాడని నాకు తెలుసు. నా అంచనాలకు మించిన ఒక అందమైన సినిమా తీశాడు. ఫస్ట్ సినిమా చేయలేకపోయాను.. రెండోది వాల్‌ పోస్టర్ సినిమా బ్యానర్‌‌కు ఛాన్స్ ఇస్తే తప్పకుండా చేస్తాను. రెండోది అనే కాదు మూడు, నాలుగో సినిమా అయినా ఓకే. సందీప్‌లో అంత టాలెంట్ ఉంది’’ అని నాని వెల్లడించారు.