Natural Star Nani's Tuck Jagadish Shoot Resumes

Nani Tuck Jagadish : నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”టక్ జగదీష్”. ‘నిన్ను కోరి’ ‘మజిలీ’ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రీతూ వర్మ – ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

నేచురల్ స్టార్ నాని మళ్లీ ‘టక్’ చేసుకున్నారు. టక్ చేసుకుని షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని ‘టక్ జగదీష్’ చిత్ర యూనిట్‌తో పాటు నాని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీనికి తగ్గట్టే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ కి విశేష స్పందన వచ్చింది. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్ రావడంతో.. నాని ‘టక్ జగదీష్’ కూడా సెట్స్ లో అడుగుపెట్టేసాడు.

కాగా, ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. షైన్ స్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.