Homeసినిమా వార్తలుమిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కొత్త రిలీజ్ డేట్ ఇదే.!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కొత్త రిలీజ్ డేట్ ఇదే.!

Miss Shetty Mr. Polishetty new Release Date: యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా రూపొందుతోన్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతోంది. సోమవారం ఈ సినిమా విడుదల తేదీని దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ బాబు.పి ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్‌ నిర్మించారు.

Miss Shetty Mr. Polishetty New Release Date: ఇప్పటికే రెండుసార్లు విడుదల తేదీని పోస్ట్ ఫోన్ చేసిన సినిమా మేకర్స్ ఫైనల్ గా ఈరోజు సెప్టెంబర్ 7న విడుదల చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. నవీన్ పోలిశెట్టి అలాగే అనుష్క సినిమాల్లో కనపడక దాదాపు మూడు సంవత్సరాలు పైనే దాటుతుంది. కాబట్టి ఈ సినిమాపై ప్రజల్లో అలాగే ఇద్దరి నటీనటుల ఫ్యాన్స్ లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన సినిమా పాటలు అలాగే టీజర్ భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.

ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా హీరో నవీన్ పోలిశెట్టి చేసిన స్పెషల్ వీడియో ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో జ్యోతిష్యుడు రంగస్థలం మహేశ్ ను ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ రిలీజ్ డేట్ చెప్పమని అడగడం, అతను 70,80 ఏళ్ల తర్వాత రిలీజ్ చేసుకోమని అనడం..చివరకు నవీన్ పోలిశెట్టి హే కృష్ణా అంటూ ఉట్టికొట్టి కృష్ణాష్టమికి మా సినిమాను తీసుకొస్తున్నాం అని ప్రకటించడం ఇంట్రెస్టింగ్ గా, హ్యూమర్ క్రియేట్ చేసింది.

Naveen Polishetty and Anushka's 'Miss Shetty Mr. Polishetty' is releasing on September 7th
Naveen Polishetty and Anushka’s ‘Miss Shetty Mr. Polishetty’ is releasing on September 7th

అనౌన్స్ మెంట్ నుంచి అందరిలో ఆసక్తి కలిగించింది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సెప్టెంబర్ 7న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. సెప్టెంబర్ 6, 7 తేదీల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం ఉండటంతో సినిమా చూసేందుకు ఈ హాలీడేస్ ఆడియెన్స్ కు కలిసిరానున్నాయి.

Naveen Polishetty and Anushka’s ‘Miss Shetty Mr. Polishetty’ is releasing on September 7, Miss Shetty Mr. Polishetty New release date, Miss Shetty Mr. Polishetty trailer date,

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY