నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ టైటిల్ పాత్రధారులుగా, ‘పిట్టగోడ’ ఫేమ్ అనుదీప్ కె.వి. డైరెక్ట్ చేసిన ‘జాతిరత్నాలు’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. ‘స్వప్న సినిమా’ బ్యానర్ పై ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. మార్చి 11న విడుదలైన ఈ చిత్రానికి మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి అనే చెప్పాలి.
‘జాతి రత్నాలు’ చిత్రానికి 10.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లోనే పెట్టుబడిలో 70 శాతం పైగా వసూలు చేసి ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటిగా నిలిచేందుకు ఉరకలు వేస్తోంది. రెండో రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.8 కోట్ల షేర్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మొదటిరోజు ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో.. పోటీగా మరో 3 సినిమాలు విడుదలైనప్పటికీ కూడా మంచి ఓపెనింగ్స్ ను సాధించింది..
డైరెక్టర్ కల్పించిన సీన్లు, రాసిన డైలాగులు, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కలిసి ‘జాతిరత్నాలు’ను హిలేరియస్ ఎంటర్టైనర్గా మార్చాయి. ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ మూవీ తర్వాత, దానికి మించి ‘జాతిరత్నాలు’ సినిమా నవీన్ పోలిశెట్టికి పెద్ద పేరు తెచ్చింది. ఇక ‘జాతి రత్నాలు’ 2 డేస్ కలెక్షన్స్ ను ఓ సారి గమనిస్తే..
నైజాం | 2.58 cr |
సీడెడ్ | 0.88 cr |
ఉత్తరాంధ్ర | 0.79 cr |
ఈస్ట్ | 0.59 cr |
వెస్ట్ | 0.49 cr |
గుంటూరు | 0.63 cr |
కృష్ణా | 0.46 cr |
నెల్లూరు | 0.32 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 6.74 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.30 cr |
ఓవర్సీస్ | 1.55 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 8.59 cr |