Nayanthara demanding more remuneration for upcoming movies
Nayanthara demanding more remuneration for upcoming movies

కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది నయనతార. ఈమె క్రేజ్ కూడా అదే స్థాయిలో ఉంది. కొత్త హీరోయిన్లు ఎంత మంది వచ్చినా నయన్ కు ఉన్న క్రేజ్ కొంచెం కూడా తగ్గకపోతుండడం ఆశ్చర్యం కలిగించే విషయం. నిజానికి గత కొన్ని రోజులుగా నయనతార మార్కెట్ బాగా పెరిగితోంది. మొదట్లో అందాలొలకబోయడానికే పరిమితమైన ఈ కేరళా భామ ఆ తరువాత అభినయానికి అవకాశం ఉన్న పాత్రల్లో సత్తా చాటుకుంటోంది. ఓ వైపు స్టార్ హీరోలతో నటిస్తూనే, మరో వైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి కూడా నయన్ వెనుకాడట్లేదు.

లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న ఈ సంచలన నటి స్థాయికి తగ్గట్టుగా పారితోషికాన్ని పెంచుకుంటూ పోతోందనే చెప్పాలి. ప్రస్తుతం చేతిలో అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి. వాటిలో సగం వరకూ లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రాలే కావడం విశేషం. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఈమె ఏ చిత్రం చేసినా దాదాపు హిట్లవుతుండడం.! ఇటీవల వచ్చిన ‘బిగిల్'(విజిల్) చిత్రం కూడా పెద్ద హిట్టైంది. అగ్రనటిగా రాణిస్తున్న నయనతార మరో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపిందన్నది తాజా సమాచారం.

దీంతో ఇదే అదునుగా భావించిన నయనతార.. తన రెమ్యునరేషన్‌ను ఒక్కసారి భారీగా పెంచేసిందట. తాజాగా జీవీ.ప్రకాశ్‌కుమార్‌ హీరోగా హర్రర్‌ చిత్రాన్ని తెరక్కెస్తున్నారు. దీని తర్వాత నయనతార ప్రధాన పాత్రలో ఒక చిత్రం చేయడానికి రెడీ అవుఉన్నారు. ఇప్పటి వరకూ సినిమాకి 6 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటూ వస్తోన్న నయన్ ఇప్పుడు ఏకంగా 8 కోట్లు డిమాండ్ చేస్తుందట. ఇదే గనక నిజం అయితే దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా నయనతార పేరు నమోదవుతుంది.