Nayanthara In Romatic Mood With Her Boy Friend Vignesh Shivan

Nayanthara: సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార మరియు దర్శకుడు విఘ్నేష్ శివన్ చాలా కాలంగా ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. రొమాంటిక్ ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ప్రేమించడంలో అమ్మడికి ఉన్న సీనియారిటీ అలాంటిది మరి. మొదట శింబుతో, ఆ తర్వాత ప్రభుదేవాను ప్రేమించింది. చివరకు వారిద్దరితో కట్ చేసుకొని యాక్టర్ కమ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో లవ్ ఎఫ్ఫైర్ నడిపిస్తూ నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. పెళ్లి అయ్యిందని కొందరు.. పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం వీరికి లేనట్లుంది. కేవలం వీరిద్దరు సహజీవనంతో జీవితంలో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఈ జోడీ హాట్ ఫొటో ఒకటి ఆన్‌లైన్ వేదికలను షేక్ చేస్తోంది.

తాజాగా ఓ ఇంట్లో ఏకాంతంగా రొమాంటిక్ మూడ్‌లో కనిపించింది నయన్ జోడీ. తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌ను ఘాడంగా కౌగిలించుకొని ఉండటంతో ఈ పిక్ క్షణాల్లోనే నెట్టింట వైరల్ అయింది. ఇప్పికే వీరిద్దరు ఎన్నో సార్లు విదేశీ ప్రయాణాలు చేశారు. అనేక సార్లు పండుగలు కలిసి చేసుకున్నారు. ఇటీవలే విఘ్నేష్ పుట్టినరోజు వేడుకను నయనతార గోవాలో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా చార్టెడ్ ఫ్లైట్ వేసుకుని మరీ ప్రియుడితో గోవా వెళ్లింది నయన్. అయితే వీటిపై రీసెంట్‌గా రియాక్ట్ అయిన విఘ్నేష్ శివన్.. ప్రస్తుతం తమ ఫోకస్ అంతా కెరీర్ మీదనే ఉందని, డేటింగ్ లైఫ్‌పై బోర్ కొడితేనే పెళ్లి గురించి ఆలోచిస్తామని ఓపెన్‌గా చెప్పేయడం జనాల్లో చర్చనీయాంశం అయింది.