Nayanthara Rajinikanth Darbar Movie Trailer Review
Nayanthara Rajinikanth Darbar Movie Trailer Review

టాలీవుడ్, కోలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ తెరకెక్కించిన దర్శకులు మురగదాస్ తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ‘దర్భార్’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గజిని, స్టాలిన్, తుపాకీ, సర్కార్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ అందించిన మురగదాస్ మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీకి సంబంధించిన లిరిక్స్, టీజర్ దుమ్మురేపాయి.

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న దర్బార్ మూవీ ట్రైలర్ విడుదలై… ఫ్యాన్స్‌కు సిసలైన మజా పంచుతోంది. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ముంబై నేపథ్యంలో సాగుతుంది. పోలీస్ పాత్రలో తలైవా యంగ్‌లుక్‌తో అదరగొట్టాడు. ‘వాడు పోలీసాఫీసరా సర్.. హంతకుడు.. ఆదిత్యా అరుణాచలం కమిషనర్ ఆఫ్ ముంబై అనే సంభాషణలతో షురూ అయ్యే ట్రైలర్ రజనీ ఫ్యాన్స్‌లో ఎక్కడలేని ఉత్సాహాన్ని నింపుతోంది.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. ఆ మద్య రజినీ నటించిన కబాలి, కాలా అంచనాలు అందుకోలేక పోయాయి. ఇటీవల వచ్చిన పెటా కాస్త పరవాలేదు అనిపించింది. తాజాగా మురగదాస్ దర్శకత్వంలో వస్తున్న ‘దర్భార్’ పై రజినీ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

నయనతార కథనాయికగా నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. దర్భార్ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. రజనీకాంత్ ఇందులో పోలీస్ అధికారి ఆదిత్యా అరుణాచలం పాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చిన ఈ మూవీ.. జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.