NBK106 Launch_ Nandamuri Balakrishna flags off his next film with Boyapati Srinu

నందమూరి బాలకృష్ణ సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే రూలర్ సినిమా రిలీజ్ కు రెఢీ అవ్వగా.. 106వ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టేశాడు బాలయ్య. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య హీరోగా సినిమా మొదలైంది.

ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు నేడు జరుపుకున్నాయి. బీ గోపాల్ ఫ‌స్ట్ క్లాప్ కొట్ట‌గా, అంబికా కృష్ణ స్విచ్చాన్ చేశారు. నువ్వొక మాటంటే అది శబ్దం.. అదే మాట నేనంటే అది శాసనం అనే డైలాగ్ బాల‌య్య తనదైన స్టైల్ లో డైలాగ్స్ చెప్పాడు. ప‌లువురు ప్రముఖులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. థ‌మ‌న్ చిత్రానికి సంగీతం అందించ‌నున్నారు. మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది. బోయపాటి శ్రీను, బాలయ్య బాబు కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు భారీ హిట్స్ గా నిలిచాయి.. ఇప్పుడు హ్యాట్రిక్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

దిశ ఘటనపై బాలయ్య బాబు మాట్లాడారు. దిశపై దుండగుల సామూహిక అత్యాచారం, హత్య ఘటనకు ప్రతిఫలంగా తగిన శిక్ష ఎదుర్కొన్నారని అన్నారు. సమాజాన్ని మార్చడానికి అప్పట్లో తన తండ్రి నందమూరి తారక రామారావు సినిమాల ద్వారా మంచి సందేశాలను ఇచ్చారని బాలయ్య అన్నారు. మహిళలపై దేశ వ్యాప్తంగా ఘోర ఘటనలు జరుగుతున్నాయని బాలకృష్ణ అన్నారు. భగవంతుడే పోలీసుల రూపంలో ఈ రోజు వారికి సరైన శిక్ష విధించాడని అన్నారు. మరోసారి ఇటువంటి చర్యలకు ఎవరూ పాల్పడకుండా భగవంతుడే కదిలి వచ్చినట్లుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసు శాఖకు అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు.