డ్రగ్స్ కేసులో రియాను అరెస్ట్ చేసిన NCB..!

455
NCB arrested Rhea Chakraborty in Drugs case and some more bollywood celebs to follow

Rhea Chakraborty: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (sushant singh rajput) కేసు చాలా కోణాల్లో తిరుగుతుంది. ఈయన అనుమానాస్పద మృతి ఇప్పుడు చాలా కోణాల్లో అన్వేషిస్తున్నారు పోలీసులు. పందొమ్మిది గంటల సేపు సునిశితంగా ప్రశ్నించిన అనంతరం డ్రగ్ కేసులో రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మంగళవారం అరెస్ట్ చేసింది.

డ్రగ్స్ కొనుగోలుపై ఈమె నిజాలు ఒప్పుకుంది. తాను డ్రగ్స్ కొన్నట్లు చెప్పడంతో ఇప్పుడు ఈమెను అదుపులోకి తీసుకున్నారు. రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి ఇచ్చిన సమాచారంతో బాలీవుడ్‌లో డ్రగ్స్ మత్తులో మునిగి తేలే 25 మంది సెలబ్రెటీల లిస్ట్ కూడా ఇప్పుడు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతుంది.

ఎన్‌సీబీ నిర్వహించిన మూడో రోజు ఇంటరాగేషన్‌లో రియా చక్రవర్తి తాను కేవలం గంజాయిని మాత్రమే కాకుండా, హార్డ్ డ్రగ్స్ కూడా వాడినట్లు అంగీకరించిందని సమాచారం. బాలీవుడ్ స్టార్లలో ఎవరెవరు డ్రగ్స్ వాడుతున్నదీ బయటపెట్టిన ఆమె, ఇప్పుడు తను కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు ఒప్పుకోవడం ఈ కేసును మరో మలుపు తిప్పింది. వాళ్లకు కూడా నేడో రేపో కచ్చితంగా నోటీసులు అందడం.. వాళ్లు విచారణకు రావడం జరగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే బాలీవుడ్‌కు డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న.. డ్రగ్స్ మాఫియాతో సంబంధం ఉన్న 8 మందిని ఈ కేసులో ఎన్‌సీబీ అరెస్ట్ చేసింది.