బింబిసార నుంచి లిరికల్ వీడియో నీతో ఉంటే చాలు రిలీజ్

వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న వెర్స‌టైల్ హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘బింబిసార (Bimbisara). ఆగస్ట్ 5న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్లో విడుదలవుతుంది.

ఈ సందర్భంగా సోమవారం ఈ సినిమా నుంచి‘నీతో ఉంటే చాలు’ (Neetho Unte Chalu song) అనే పాటను ఎమోషనల్ లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

ప్ర‌ముఖ సీనియ‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి సంగీతం అందించిన ఈ సినిమాలోని ఈ పాట‌ను స్వ‌యంగా కీర‌వాణి రాయ‌టం విశేషం. మోహ‌న భోగ‌రాజు, శాండిల్య పాట‌ను ఆల‌పించారు.

అనుబంధం గురించిన తీపి అనుభూతులను అనుభవిస్తున్నాడు మన బింబిసారుడు. అసలు త్రిగర్తల సామ్రాజ్యాధిపతి అయిన బింబిసారుడు ఈ కాలాని ఎందుకు వచ్చాడు.

ఎవరితో స్నేహం కోరి వచ్చాడు. ఆయన ఏ పని కోసం వచ్చాడో ఆ పని నేర వేరిందా? ఆ వ్య‌క్తిని క‌లుసుకున్నాడా? అనే విష‌యాలు తెలియాలంటే మాత్రం ‘బింబిసారుడు’ సినిమా చూడాల్సిందే.. వశిష్ట్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై హ‌రికృష్ణ .కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Click Here for Song  

- Advertisement -

 

Related Articles

Telugu Articles

Movie Articles