మాస్ క దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. ఈ చిత్రంలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటిస్తోంది. పాట విడుదల సందర్భంగా లైవ్ వేదికపై విశ్వక్ మరియు నేహాల రొమాంటిక్ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
సాంగ్ లాంచ్‌లో భాగంగా విశ్వక్-నేహా శెట్టి ప్రమోషన్స్‌కు రావటం జరిగింది. సినిమా పాటలో మాదిరిగానే వేదికపై నేహా శెట్టి చీరను విశ్వక్ సేన్ పట్టుకొని రొమాంటిక్ గా బీట్ స్టార్ట్ అయిన వెంటనే వీరిద్దరూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు, వారి రొమాంటిక్ మూమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు యువ హీరోలు, హీరోయిన్లు పబ్లిసిటీ కోసం ఏమైనా చేయాలని చూస్తున్నారని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది. నేహా శెట్టి ఎలాంటి భయం లేకుండా చీర విప్పి వేదికపై డ్యాన్స్ చేయడం నెటిజన్లకు షాక్ ఇచ్చింది.
నిన్న జరిగిన కుషి సినిమా ఈవెంట్‌లో కూడా అలాంటి సన్నివేశమే జరిగింది. విజయ్ దేవరకొండ వేదికపై తన షర్ట్ తీసి సమంతతో కలిసి డ్యాన్స్ చేశాడు. స్టేజి మీద కెమిస్ట్రీ ఈ రేంజ్‌లో ఉంటే సినిమాలో ఇంకా ఎలా ఉంటుందో అంటున్నారు నెటిజన్లు. మొత్తానికి విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ లాంటి యువ హీరోలు హీరోయిన్లతో స్టేజ్‌పై డ్యాన్స్ చేయడం కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టారు.

ఆఫ్‌స్క్రీన్‌పై తన దూకుడు వైఖరితో ప్రత్యేక ఇమేజ్‌ని సొంతం చేసుకున్న హీరో విశ్వక్‌సేన్ దృష్టి ఎప్పుడూ విభిన్నమైన కథలు, పాత్రలపైనే ఉంటుంది. విశ్వక్ సేన్ సినిమాలు మంచి వసూళ్లు రాబడుతున్నాయి, కానీ అవి పెద్దగా బ్లాక్ బస్టర్స్ అవ్వలేదు. తనకు పెద్ద బ్రేక్ ఇచ్చే స్థాయిలో విజయం సాధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.