Nenu Student Sir Review: బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ హీరో అన్నయ్య బెల్లంకొండ శ్రీనివాస్ లాగా మా సినిమాలు కాకుండా క్లాస్ సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. నటించిన మొదటి చిత్రం స్వాతిముత్యంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ గణేష్ ఆ తర్వాత నుంచి విభిన్న తరహా కతాంశాలను ఎంచుకుంటూ చిత్రాలు చేస్తున్నారు. ఈ తరహాలో విడుదలైన కొత్త చిత్రం నేను స్టూడెంట్ సర్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం…
Nenu Student Sir Review: రేటింగ్ : 2.25/5 – నటీనటులు : బెల్లంకొండ గణేష్, అవంతిక దాసాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్ – సంగీతం : మహతి స్వర సాగర్ – నిర్మాత : నాంది సతీష్ వర్మ – దర్శకత్వం : రాకేష్ ఉప్పలపాటి
కథ: సుబ్బారావు అనే కాలేజ్ స్టూడెంట్ కి ఐఫోన్ 12 అంటే చెప్పలేనంత పిచ్చి. పాపం అది కొనాలి అన్న ఉద్దేశంతో 9 నెలలు కష్టపడి దాచుకున్న డబ్బు 90000 ఖర్చు పెట్టి కొనుక్కుంటాడు. అయితే సరిగ్గా ఫోన్ కొన్న రోజే కాలేజీలో జరిగిన ఒక గొడవ కారణంగా అతను పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సి వస్తుంది. ఫార్మాలిటీ ప్రకారం పోలీసులు అక్కడ సుబ్బు ఫోన్ ని కలెక్ట్ చేసుకుంటారు…కానీ తిరిగి ఫోన్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ అతను ఫోన్ దొరకదు.
ఎంతో ఇష్టపడి కొనుక్కున్న కొత్త ఫోన్ కావడంతో సుబ్బు ఈ విషయం మీద కమిషనర్ అర్జున్ వాసుదేవ్ (సముద్రఖని) కు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాడు. కమిషనర్ పట్టించుకోకపోవడంతో చివరికి ఆయన కూతురు శృతి (అవంతిక దాసాని) తో ఫ్రెండ్షిప్ చేసి తన ఫోన్ దక్కించుకోవాలి అని సుబ్బు ప్లాన్ చేస్తారు. అయితే అనూహ్యంగా ఫోన్ కోసం చేసిన ఫ్రెండ్షిప్ కాస్త సుబ్బు మీద మర్డర్ కేసు పడేలా చేస్తుంది. అసలు ఏం జరిగింది? సుబ్బు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు? అతని ఫోన్ ఎవరు దొంగలించారు? చివరికి అతనికి ఫోన్ ఎలా దొరికింది? ఇవన్నీ తెలియాలంటే పెద్ద స్క్రీన్ పై సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: ఈ మూవీకి కాన్సెప్ట్ మెయిన్ హైలెట్ అని చెప్పవచ్చు. ట్రైలర్ లో చూపించినట్లుగా ఈ చిత్రం మొత్తం కేవలం పోగొట్టుకున్న ఐఫోన్ చుట్టూ తిరగదు. కాన్సెప్ట్ అయితే బాగుంది కానీ అది చూపించాలి అని డైరెక్టర్ పడ్డ తాపత్రయం సినిమాను బాగా సాగదీసింది అని చెప్పవచ్చు. ఒకరకంగా ఫస్ట్ అఫ్ మొత్తం స్టోరీ ఎక్కడికి కదలదు.. బాగా డ్రాగ్ చేసిన తర్వాత ఇంటర్వెల్ సీన్ దగ్గర నుంచి అసలు స్టోరీ ప్రారంభమవుతుంది.
ఫస్ట్ హాఫ్ లో మాక్సిమం హీరోకి ఉన్న డైలాగ్ అంతా బ్లాక్ ఐఫోన్… 12 సిరీస్.. 64 జిబి…రూ.89,999…అలాగే ఐఫోన్లు తమ్ముడు బుజ్జి బాబు అని పిలవడం. ఒక్కసారి అయితే కామెడీగా ఉంటుంది కానీ సినిమాలో సగం పైన ఇవే డైలాగులు రిపీట్ అవ్వడంతో ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది. ఒక సాధారణ మిడిల్ క్లాస్ అబ్బాయి తన ఐఫోన్ కోసం కమిషనర్ ఎదురవెల్లి ప్రాణాలకు తెగించి చేసే సీక్వెన్స్ కాస్త అసాధారణంగా ఉంది.
మూవీలో కొన్ని సన్నివేశాలు కావాలని తీసుకొచ్చి అతికించినట్లుగా సినిమాకి ఎటువంటి సంబంధం లేకుండా ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్ నడిపే టిక్ టాక్ ట్రాక్ అలాగే హీరో హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ…ఇవి సినిమా కథకు ఏమాత్రం సంబంధం లేనట్లుగా అనిపిస్తాయి. ఈ మూవీలో వెరైటీ ఏమిటంటే మనకు కామెడీ సీన్స్ కి ఏడుపు ఎమోషనల్ సీన్స్ కి నవ్వు కచ్చితంగా వస్తుంది.

ప్లస్ పాయింట్స్:
*బెల్లంకొండ గణేష్ యాక్షన్ ఈ మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.
*మూవీ కాన్సెప్ట్ విభిన్నంగా ఉండడంతో పాటు కాస్త ఆకట్టుకునే విధంగా ఉంది.
*సునీల్ కామెడీ సీన్స్ కాస్త నవ్వు తెప్పిస్తాయి.
మైనస్ పాయింట్స్:
*స్టోరీ బాగా సాగదీతగా.. ట్విస్టులు మెల్లగా రివీల్ అవుతూ బోరింగ్ గా అనిపిస్తాయి.
*మూవీలో లాజిక్ అనే కాన్సెప్ట్ లేదు.
*హీరోయిన్ డైలాగ్స్ కి లిప్ సింక్ అస్సలు లేదు.
*మంచి కాన్సెప్ట్ అయినప్పటికీ స్క్రీన్ ప్లస్ సరిగా లేకపోవడంతో సూపర్ థ్రిల్లర్ అవ్వాల్సిన మూవీ.. పేలవంగా వచ్చింది.
చివరి మాట: ఓవరాల్ గా చెప్పాలి అంటే మంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో స్టార్ట్ అయినప్పటికీ స్క్రీన్ ప్లే స్లోగా సాగడంతో మూవీ దెబ్బతింది. మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్ అనుకొని వెళ్తే మాత్రం
ఇబ్బంది పడాల్సిందే. మొత్తానికి ఓటీటీ లో రిలీజ్ అయితే ఏదో ఒకసారి చూడొచ్చు తప్ప మూవీ థియేటర్ కి వెళ్లి మరీ చూసే అంత రేంజ్ అయితే ఈ సినిమాకి లేదు.