Indian movies ban at Nepal: ప్రభాస్ (Prabhas) రాముడిగా చేసిన ఆదిపురుష్ (Adipurush) సినిమా భారీ అంచనాల మధ్య విడుదల అయినప్పటికీ ప్రేక్షకుల నుంచి పలు విమర్శలకు గురి అయింది. ఈ సినిమా విడుదలైన నాటి నుంచి నేటి వరకు విపరీతంగా ట్రోలింగ్ కి గురి అవుతుంది. విపరీతంగా వెల్లువెత్తుతున్నటువంటి నెగిటివ్ కామెంట్స్ తో ఎట్టకేలకు మూవీ టీం దిగి వచ్చింది.
Indian movies ban at Nepal: సినిమా మేకింగ్ దగ్గర నుంచి డైలాగ్స్ వరకు లుక్స్ దగ్గర నుంచి ప్రజెంటేషన్ వరకు ఇలా ప్రతి విషయంలో ప్రేక్షకులు ఎంతో అసంతృప్తితో ఉన్నారు. ఎంతో పరమ పవిత్రమైనటువంటి రామాయణాన్ని వక్రీకరించి సినిమాగా తీశారు అంటూ వారు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సీతాదేవి జన్మస్థలం భారతదేశం అనే అర్థం వచ్చేలా పెట్టిన డైలాగ్ పై నేపాల్ ప్రభుత్వం ఇప్పటికే స్పందించింది.
రామాయణాన్ని ఇష్టం వచ్చినట్లు మార్చి సినిమాగా తీశారు అని అక్కడ నేతలు భారతీయ సినిమాలపై నిషేధం విధించారు. సీతాదేవి జన్మస్థలం గురించి అభ్యంతరకరంగా ఉన్నటువంటి డైలాగులను రిమూవ్ చేసి సినిమా టీం క్షమాపణ చెప్పకపోతే భారతీయ సినిమాలను నేర్పాల్లో ప్రదర్శించమని హెచ్చరించారు కూడా.
ఈ విషయం పై ప్రస్తుతం ఆదిపురుష్ మూవీ టీమ్ స్పందించడమే కాకుండా ఇండియన్ చిత్రాలపై నిషేధాన్ని ఎత్తి వేయవలసిందిగా టీ-సిరీస్ ఖాట్మండు మేయర్ కు క్షమాపణలు తెలియపరుస్తూ లేఖను కూడా పంపారు.
” మా కారణంగా నేపాల్ ప్రజల యొక్క మనోభావాలు ఏ విధంగా అయినా దెబ్బతిని ఉంటే మమ్మల్ని క్షమించండి…ఒట్టేసి పూర్వకంగా నేను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలి అనుకోలేదు. మేము నిర్మించిన ఆదిపురుష్ చిత్రాన్ని ఒక
కళాత్మక కోణంలో చూడాలి అని అభ్యర్థిస్తున్నాము. ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులలో చరిత్రపై ఆసక్తి కలిగించాలి అన్న మా ఉద్దేశానికి మీరు మద్దతు ఇవ్వాలి అని మేము అభ్యర్థిస్తున్నాము” అన్నది లేఖ లోని సారాంశం.

అయితే ఈ లేఖ పై నేపాల్ ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. మరి ఇప్పటికైనా భారతీయ సినిమాలపై విధించిన నిషేధాన్ని తొలగిస్తారా లేదా అనే విషయంపై కూడా స్పష్టత లేదు. ఇక ఈ సినిమా విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం చిత్రంలోని పలు సన్నివేశాలు మరియు డైలాగ్స్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా మాత్రం బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాండంగా దూసుకు వెళ్తోంది.