OTT News: నెట్‌ఫ్లిక్స్‌ మోస్ట్‌ అవెయిటెడ్‌ అంథాలజీ ‘నవరస’ రిలీజ్‌ డేట్‌

0
19
Vijay Sethupathi, Suriya, Parvathy Thiruvothu starring Navarasa release date

Netflix Navarasa: తొమ్మిది క‌థ‌ల స‌మాహారంగా రూపొందుతూ ప్రారంభం నుంచి అంద‌రిలో ఆస‌క్తి క‌లిగించిన అంథాల‌జీ ‘న‌వ‌ర‌స‌’. ఏస్ డైరెక్టర్‌ మ‌ణిర‌త్నంతో పాటు ప్రముఖ రైట‌ర్, ఫిల్మ్ మేక‌ర్ జ‌యేందర్‌ పంచ‌ప‌కేశ‌న్ స‌మ‌ర్పణలో ఈ అంథాల‌జీ ఫిల్మ్ రూపొందింది.

మాన‌వ జీవితంలోని భావోద్వేగాలు తొమ్మిది. వీటిని న‌వ‌ర‌సాలు అని కూడా అంటాం. (కోపం, ధైర్యం, క‌రుణ‌, అస‌హ్యం, భ‌యం, వినోదం, ప్రేమ‌, శాంతి, ఆశ్చ‌ర్య‌పోవ‌డం) వీటి ఆధారంగా ‘న‌వ‌ర‌స‌’ రూపొందింది. ప్రముఖ డిజిట‌ల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ అంథాల‌జీని ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాల్లో ఆగ‌స్ట్ 6న విడుద‌లచేస్తోంది.

‘నవరస’ అంథాలజీ తమిళ సినీ రంగానికి సంబంధించిన సాంస్కృతిక గర్వకారణంగానూ, అద్భుతంగా..మైలురాయిగా నిలవనుంది. అందుకు కారణం అద్భుతమైన నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ ఈ అంథాలజీ రూపకల్పన కోసం ముందుకు రావడమే. టాప్‌ మోస్ట్‌ నటీనటులు, దర్శకులు, సంగీత దర్శకులు, రచయితలు, నిర్మాతలు ఇతర సాంకేతిక నిపుణుల కలిసి ఈ అంథాలజీకి జీవం పోయడమే కాకుండా సాటిలేని ఓ కలను సాకారం చేశారు.

తమిళ సినిమా రంగంలోని అద్భుతమైన సృజనాత్మకతను కలిగిన వారందరూ ఈ సినిమాకు పనిచేశారు. కొవిడ్‌ సమయంలో ఇబ్బందులు పడ్డ సినీ పరిశ్రమలోని కార్మికుల శ్రేయస్సు కోసం ఈ ఫిల్మ్‌ ద్వారా వచ్చిన ఆదాయాన్ని వినియోగించనున్నారు. ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న .. తొమ్మిది మంది స్టార్స్‌తోపాఉ అరవింద్ స్వామి, బెజోయ్ నంబియార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, కార్తీక్ నరేన్, కార్తీక్ సుబ్బరాజ్, ప్రియదర్శన్, రతీంద్రన్ ప్రసాద్, సర్జున్ మరియు వసంత సాయి దర్శకులుగా తిరుగులేని విజన్‌తో ‘నవరస’లోని ప్రతి రసాన్ని రూపొందించారు.