ఓటీటీలో విడుదలవ్వనున్న నాగార్జున ‘వైల్డ్ డాగ్’ నిజం ఎంత?

0
182
Netflix Bagged the digital rights of Nagarjuna Wild Dog movie

Wild Dog on Netflix: కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో సినిమాలన్ని ఓటీటీలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ కాగా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాగార్జున హీరోగా సాల్మన్ రూపొందుతున్న వైల్డ్ డాగ్ మూవీ విడుదలకు సిద్దం అయినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో నాగార్జున ఎన్ ఐ ఏ ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. దియా మీర్జా మరియు సయామీ ఖేర్ లు కీలక పాత్రలో కనిపిస్తారు.. తాజాగా వైల్డ్ డాగ్ కూడా ఓటీటీలో విడుదలవుతున్నట్లు సమాచారం.

అయితే ఇంకా షూటింగ్ పూర్తి కాని కారణంగా ఇప్పటి వరకు ఆ విషయమై క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా షూటింగ్ పూర్తి అవ్వడంతో మళ్లీ డిజిటల్ రిలీజ్ వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీని ఒకేసారి థియేటర్‌తో పాటు ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. నెట్‌ ఫ్లిక్స్‌ ద్వారా సినిమా విడుదల కానుంది. సమాచారం ప్రకారం నెట్ ప్లిక్స్ వారు ఈ సినిమాను పెట్టుబడి కంటే ఎక్కువ మొత్తంకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారట.

అహిషోర్‌ సోల్మన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. దియా మిర్జా, సయామీ ఖేర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌ విజయ్ వర్మగా కనిపించనున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ పనులు జరుగుతున్నాయి. థియేటర్ల ఓపెన్ విషయంలో కేసీఆర్ తో చర్చించిన నాగార్జున తన సినిమాను ఓటీటీలో ఎలా విడుదల చేస్తాడని భావిస్తున్నారు కొంతమంది.. ఏది నిజం అనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here