నివేదా థామస్ పై అసభ్యకరమైన కామెంట్లు..!

0
553
Shocking Comments On Nivetha Thomas
Shocking Comments On Nivetha Thomas

నాని యొక్క నిను కోరి సినిమాతో నివేదా థామస్ టాలీవుడ్ కి పరిచయం చేసారు, అలాగే ఇపుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ యొక్క వి. లో నటిస్తున్నారు. సోషల్ మీడియా ఊపు ఎక్కువైన తరుణంలో సెలెబ్రిటీలతో నేరుగా చెప్పాలనుకున్నది చెప్పేస్తున్నారు నెటిజన్లు. తాజగా నివేదా థామస్ విషయంలో కూడా అదే జరిగింది. ఆమె ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అసభ్యకరమైన ప్రశ్నలను ఎదుర్కొంది. సరదాగా కాసేపు తన అభిమానులతో ముచ్చటించాలని చాట్ సెషన్ లో పాల్గొంది నివేదా థామస్..! అయితే ఈ క్రమంలో నెటిజన్లు కాస్త హద్దులు దాటి.. ‘నువ్వు వర్జినేనా’ అసభ్యకరమైన ప్రశ్న వేశారు.. మరికొందరు ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నారా అని అడిగారు.

నివేదా థామస్ వారికి సమాధానమిస్తూ.. “మీరు అడిగిన ఫన్నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పి చాలా ఎంజాయ్ చేశాను. అయితే మరికొందరు అడిగిన ప్రశ్నలను నేను పట్టించుకోలేదు పట్టించుకోను అలాగే సమాధానం ఈవను కూడా. చాలా మంది పెళ్లెప్పుడు.. ఒక్క మాటలో చెప్పండి, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా లేరా, మీరు వర్జినా? కాదా?.. అంటూ దరిద్రమై ప్రశ్నలు వేశారు. మీరు మాట్లాడేది కూడా ఓ మనిషితోనేనని కాస్త గుర్తుంచుకోండి. ఏదేమైనా మీతో చాట్ సెషన్ నేను చాలా ఎంజాయ్ చేశాను. త్వరలో మళ్ళీ కలుద్దాం” అంటూ ఎంతో ఓపికగా చెప్పుకొచ్చింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here