Hari Hara Veera Mallu Story: పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. భీమ్లా నాయక్ సినిమా విడుదలకు సిద్ధం చేయగా, ఫిబ్రవరి నుండి హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం చేస్తుండగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా ఉంది. అయితే ఈ సినిమా సంబంధించి న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రీసెంట్ గా నిధి అగర్వాల్ హీరో సినిమా ప్రమోషన్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు స్టోరీ గురించి ఓపెన్ కామెంట్ చేసింది. ‘హరిహర వీరమల్లు’ సినిమా రెండు కాలాల మధ్య సాగే కథ అని చెబుతూ చిత్రానికి సంబంధించిన మెయిన్ పాయింట్ బయటపెట్టింది నిధి. అంటే ఈ సినిమాలో పవన్ రెండు డిఫరెంట్ గెటప్పుల్లో కనిపించనున్నారని అర్థం చేసుకోవచ్చు.
17వ శతాబ్దం నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ క్రిష్. ఈ మూవీ కోసం 180 కోట్ల మేర బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. ప్రస్తుతం కరోనా కారణంగా కొన్ని రోజులపాటు బ్రేక్ ఇచ్చారు. అయితే ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటనేది డైరెక్టర్ క్రిష్ కాస్త సస్పెన్సులోనే పెట్టగా తాజాగా నిధి అగర్వాల్ రివీల్ చేసేసింది.

నిధి అగర్వాల్ హీరోయిన్ గా అలాగే అశోక్ గల్లా హీరోగా పరిచయం కాబోతున్న ఈ “హీరో” సినిమాను జనవరి 15న విడుదల చేస్తున్నారు.