పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన నిధి

450
Nidhi Agarwal confirmed role in Pawan Kalyan Krish movie PSPK27

`సవ్యసాచి` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్‌. ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఈ మూవీ తరువాత చేసిన `మిస్టర్ మజ్ను` కూడా అదే స్థాయిలో విఫలం కావడంతో ఆలోచనలో పడ్డ నిధి అగర్వాల్ `ఇస్మార్ట్ శంకర్` బంపర్ హిట్‌ని అందించింది. ఇప్పుడా విజయోత్సాహంలోనే ఇటు తెలుగు, అటు తమిళంలో వరుస సినిమాలతో జోరు చూపిస్తోంది. నిధికి తాజాగా గోల్డెన్ ఆఫర్ లభించింది.

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ క్రిష్ తెరకెక్కిస్తున్న పిరియాడిక్ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఏ.ఎం. రత్నం నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కాబోతోంది. ఆమె త్వరలో పవన్‌ కల్యాణ్‌కు జోడీగా క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలు నిజమేనని ధ్రువీకరించింది నిధి.

దీనిపై ఆమె ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ‘‘అవును, నేను పవన్‌ కల్యాణ్‌తో ఓ సినిమా చేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఓ కలలా వుంది. ఇదినా తొమ్మిదవ చిత్రం. నా కెరీర్‌కిది గోల్డెన్ ఫిల్మ్ అవుతుంది. పవన్ సర్‌తో కలిసి పని చేయడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నాను` అని తెలిపింది.

Nidhi Agarwal important role in PSPK 27 confirmed