Niharika Chaitanya Divorced News: నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ విడాకుల అంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే మొత్తం మీదకు తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. ఈ మేరకు నిహారిక అలాగే చైతన్య విడాకులు తీసుకున్నారు.
Niharika Chaitanya Divorced News: హిందూ వివాహ చట్టం కింద కోర్టును ఆశ్రయించారు. కొన్ని రోజులుగా ఈ వార్త మీడియాలో హల్‌చల్ చేస్తున్నప్పటికీ.. అది అబద్ధం అవుతుందని అభిమానులు ఆశించారు, కానీ పాపం.. వారు కోరుకున్నట్లుగా జరగలేదు. తాజాగా చైతన్య సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. విడాకులు తీసుకోబోతున్నట్లు నిహారిక పిటిషన్ అధికారికంగా ప్రకటించింది. 2020లో చైతన్య జొన్నలగడ్డ నిహారిక కొణిదెలను అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.
దీనికి సంబంధించిన కోర్టు ఆర్డర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నెలరోజుల క్రితమే ప్రముఖ లాయరు దిలీప్ సుంకర నిహారిక తరపున కోర్టుకి దరఖాస్తు చేయగా పరస్పర అంగీకారంతో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో నెలరోజుల కిందటే కోర్టు విడాకులను మంజూరు చేసింది.

నిహారిక డ్రగ్ కేస్ దగ్గర నుండి వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని, విడిపోయేందుకు సిద్ధపడ్డారని సినీ వర్గాల్లో ప్రచారం సాగింది. పెళ్లి ఫోటోలు అలాగే ఇద్దరు కలిసి దిగిన ఫొటోలను ఇరువురు సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించడంతో ఆ వార్తలకు బలం చేకూరింది. మరోవైపు, మెగా కుటుంబంలో జరిగిన వేడుకలన్నింటికీ నిహారిక మాత్రమే హాజరుకావడం చర్చకు దారి తీసింది. వీటిపై మెగా ఫ్యామిలీ నుండి అలాగే చైతన్య ఫ్యామిలీ నుండి ఎవరు స్పందించలేదు. అయితే కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ ప్రచారం మొత్తం మేరకు ముగింపు పలికింది.