మెగా ఇంట్లో పెళ్ళి సంద‌డి…నిహారిక నైట్ పార్టీ

0
448
Niharika Enjoying party With Her Sisters Sreeja And Sushmita Konidela

మెగా ఇంట పెళ్లి సంబరాలు షురూ అయ్యాయి. డిసెంబ‌ర్ 7న మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ముద్దుల కూతురు నిహారిక‌.. చైత‌న్య‌తో ఏడ‌డుగులు వేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుకల కోసం మెగా ఫ్యామిలీ లేడీస్ అంతా ఒక్కచోట చేరి తెగ సందడి చేస్తున్నారు. చిరంజీవి ఇద్దరు కూతుళ్లు, అక్కలైన సుస్మిత, శ్రీజలకు స్పెషల్ పార్టీ ఇచ్చింది నిహారిక.

ఇక డిసెంబర్ 9వ తేదీన నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్ ఉంటుందని ఇటీవలే నాగబాబు ప్రకటించడంతో మెగా ఇంట సందడి మొదలైంది. రాజ‌స్తాన్ ఉద‌య్‌పూర్ ప్యాలెస్‌తో వీరి వివాహం జ‌ర‌గ‌నుండ‌గా, పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్ల‌ను వ‌రుణ్ తేజ్ చూసుకుంటున్నాడు. మెగా రేంజ్‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఈ వేడుక‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. నెల రోజుల ముందునుంచే ఫ్యామిలీలో సెలబ్రేషన్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గత రాత్రి మెగా సిస్టర్స్ అంతా కలిసి చిల్ అయిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలను నిహారిక తన ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. మెగా డాటర్స్ అందరూ కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేసినట్లు ఈ ఫోటోలు చూస్తుంటే అర్థమైపోతోంది. నిహారిక పోస్ట్ చూసి ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు మెగా ఫ్యాన్స్. ఆ మ‌ధ్య త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి గోవాలో పార్టీ చేసుకున్న ఈ అమ్మ‌డు తాజాగా త‌న అక్క చెల్లెళ్ళ‌తో క‌లిసి ర‌చ్చ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here