Homeసినిమా వార్తలుఅల్లు అర్జున్ పుష్ప 2 లో కీలకమైన పాత్ర కోసం నిహారిక.. క్లారిటీ ఇదే.!!

అల్లు అర్జున్ పుష్ప 2 లో కీలకమైన పాత్ర కోసం నిహారిక.. క్లారిటీ ఇదే.!!

Niharika in Pushpa 2 The Rule: ప్రస్తుతం అల్లు అర్జున్ (Allu Arjun) అలాగే సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా సీక్వెల్ పుష్ప 2 షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. పుష్ప2 సినిమాలో మెగా డాటర్ నిహారిక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్టు న్యూస్ ప్రచారంలో ఉంది. పుష్ప2 మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్న సుకుమారు ఈ సినిమా కొత్తగా తీసుకున్న నటీనటుల ఫోటోషూట్ అలాగే క్యారెక్టర్స్ ని ఫైనలైజ్ చేయటానికి షూటింగ్ కి గ్యాప్ ఇవ్వటం జరిగింది.

Niharika in Pushpa 2 The Rule: అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప సినిమా అటు సౌత్ లోనూ అలాగే నార్త్ లోనూ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 మీద అందరికీ భారీగానే అంచనాలు ఉన్నాయి. దీనితో సుకుమారు ఈ సీక్వెల్ ని మరింత జాగ్రత్తగా తరికెక్కిస్తున్నారు. ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకు ఈ సినిమాలో జగపతిబాబు (Jagapathi Babu) అలాగే మెగా డాటర్ నిహారిక (Niharika) కీలకమైన పాత్రల కోసం ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.

జగపతిబాబు అయితే రీసెంట్గా రామబాణం ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఇక మెగా డాక్టర్ నిహారిక విషయానికి వస్తే, గిరిజన అమ్మాయి పాత్రలో నిహారిక (Niharika) కనబడబోతుందంట. సినిమాలో నిహారిక కూడా కీలకమైన పాత్ర అలాగే సినిమాకే టర్నింగ్ పాయింట్ అంటున్నారు. అయితే ఈ పాత్ర కోసం సుకుమార్ మొదట సాయి పల్లవిని (Sai Pallavi) సంప్రదించగా.. టాప్ హీరోయిన్ లిస్టులో ఉన్న పల్లవి ఈ క్యారెక్టర్ చేయటానికి ఒప్పుకోలేదు అంటూ కథనాలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పాత్ర కోసం నిహారిక పేరు పరిశీలిస్తున్నారట. ఆల్మోస్ట్ ఆమెను ఓకే చేసినట్లు తెలుస్తోంది.

గత కొంతకాలంగా నిహారిక (Niharika) అటు సోషల్ మీడియాలోనూ అలాగే వార్తల్లోను నిలుస్తుంది. తన వ్యక్తిగత జీవితం గురించి వెబ్ మీడియాలో చాలా ప్రచారాలు జరుగుతున్నాయి. దీనికి కారణం భార్యాభర్తలు మధ్య జరిగిన గొడవ విడాకులు వరకు వెళ్లిందట. అయితే దీని మీద మెగా ఫ్యామిలీ నుండి ఎటువంటి స్పందన లేదు. ఇక అల్లు అర్జున్ పుష్ప విషయానికి వస్తే, ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Niharika key role in allu arjun Pushpa 2 The Rule

అదేవిధంగా సుకుమారు పుష్ప 2 కూడా ఏమాత్రం తగ్గకుండా షూటింగ్ చేస్తున్నట్టు వార్తలు వినబడుతున్నాయి. దీనికి నిదర్శనంగా అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అయిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ డైలాగులు మేనరిజం అలాగే సాంగ్స్ ఈ సినిమాని భారీ హిట్ చేశాయి. మరి పుష్ప టు ఎలా ఉండబోతుందో మరి కొన్ని రోజుల్లో తెలుస్తుంది.

- Advertisement -

Web Title: Niharika key role in allu arjun Pushpa 2 The Rule, Pushpa 2 The Rule, latest news, Sukumar, Rashmika Mandanna, Jagapathi Babu Pushpa 2 shooting update

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY