Niharika Konidela and Chaitanya to have destination wedding in December

Niharika Konidela Marriage Date: నిహారిక కొణిదెల వివాహం త్వరలో జరగనుందనే విషయం తెలిసిందే. గుంటూరు జిల్లాకు చెందిన ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలో ఇటీవలే నిహారిక – చైతన్యల నిశ్చితార్థం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. నిహారిక పెళ్లి పనులు షురూ అయ్యాయట. పెళ్లి ఏర్పాట్లతో వరుణ్ తేజ్ బిజీ అయిపోయారట. ఈ విషయాన్ని నిహారిక తండ్రి నాగబాబు కన్ఫర్మ్ చేశారు.

తాజాగా నాగబాబు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్ళికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. నిహారిక పెళ్లి సంబరాలు తమ కుటుంబంలో ఆనందం నింపాయని, డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం కొన్ని ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను నా కొడుకు వరుణ్ తేజ్ చూసుకుంటున్నాడు. డిసెంబర్ నెలలో నిహారిక – చైతన్యల డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. పెళ్లి తేదీని త్వరలోనే అందరికీ తెలియజేస్తాం, అని పేర్కొన్నాడు.