ఫొటోటాక్ : మెగా ఫ్యామిలీలో మరో హీరో ?.. దీపావళి పండగను గ్రాండ్‌గా.. నిహారిక- చైతన్య

0
447
Niharika Konidela Celebrates Diwali With Chaitanya

మెగా డాటర్ నిహారిక చాలా ఫాస్ట్‌గా ఉంది. కాబోయే భర్తతో పెళ్లికి ముందే దీపావళి సంబరాలు చేసుకుంది. కాబోయే భార్యాభర్తలు నిహారిక- చైతన్య దీపావళి వేళ మెగా ఇంట సందడి చేశారు. నాగబాబు, వరుణ్ తేజ్‌లతో కలిసి ఆనందంగా పండగ సెలబ్రేట్ చేసుకున్నారు. దీపావళి సందర్బంగా మెగా హీరో వరుణ్ తేజ్ షేర్ చేసిన ఈ ఫొటో చూసిన తర్వాత మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. ఇందులో ట్రెడిషనల్ లుక్‌లో కనిపించి ఆకట్టుకుంటోంది నిహారిక- చైతన్య జోడీ.

నెట్టింట వైరల్ అయిన ఈ ఫొటో చూసిన వెంటనే చాలా మంది చైతన్య కూడా హీరో అయితే బాగుంటుంది అన్నట్లుగా కామెంట్ చేస్తున్నారు. మూడు నెలల క్రిందట మెగా అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ తాను ‘మిస్’ నుంచి ‘మిసెస్ నిహా’గా ప్రమోట్ అవుతున్నానని, తనకు కాబోయే భర్త ఇతనే అంటూ చైతన్య ఫోటోను స్వయంగా షేర్ చేసిన నిహారిక.. ఫొటోను సరిగ్గా చూస్తే వరుణ్ తేజ్ మరియు చైతన్యలు సమానమైన హైట్ ఉన్నట్లుగా అనిపిస్తున్నారు. టాలీవుడ్ లో మంచి హైట్ ఉన్న హీరోల్లో వరుణ్ ఒకరు. ఆయన కంటే చైతన్య ఒకటి రెండు సంటిమీటర్లు ఎక్కువగానే అనిపిస్తున్నాడు. కనుక హీరో అయ్యే మొదటి లక్షణం లక్షణంగా చైతన్యకు ఉందని అందుకుకే చైతన్య హీరోగా ఎంట్రీ ఇస్తే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నిహారికకు కాబోయే భర్త పూర్తిపేరు జొన్నలగడ్డ వెంకట చైతన్య. ఇతను గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కొడుకు. ఇకపోతే నిహారిక- చైతన్య డెస్టినేషన్ వెడ్డింగ్ డిసెంబర్ 9వ తేదీ రాత్రి 7గంటల 15 నిమిషాలకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరగనుందని ఇటీవలే అఫీషియల్‌గా ప్రకటించారు నాగబాబు. అప్పటినుంచి పెళ్లి మూడ్ లోని వెళ్లిపోయిన నిహారిక, ఎప్పటికప్పుడు తనకు కాబోయేవాడితో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్ల చేత ప్రేమ పక్షులం అనిపించుకుంటోంది.

Previous articleSudheer Babu and Indraganti Hat trick combination again
Next articleబిగ్ బాస్ షోలో మలుపులు మెహబూబ్ ఔట్..?