Niharika Konidela Enjoy With Her Friends At Goa

Niharika Konidela: మరికొద్ది రోజుల్లోనే పెళ్లి పీటలేక్కబోతున్న మెగా డాటర్ నిహారిక.. గోవా వెళ్లి అక్కడ తన స్నేహితులతో చిల్ అవుతోంది. లాక్‌డౌన్ కారణంగా ఇన్నిరోజులు ఇంట్లోనే ఉన్న ఆమె, స్నేహితులతో కలిసి ప్రస్తుతం గోవా టూర్ ఎంజాయ్ చేస్తోంది. గుంటూరుకు చెందిన ఐజీ జె. ప్రభాకర్ రావు తనయుడు చైతన్య జొన్నలగడ్డతో వివాహం ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇరుకుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆగస్టులో నిహారిక – చైతన్య జొన్నలగడ్డ నిశ్చితార్థం జరిగింది.

కాబోయేవాడితో దిగిన పిక్స్ షేర్ చేస్తూ ఇటీవలే తన పెళ్లి శుభవార్త చెప్పిన నిహారిక.. ‘మిస్’ని కొట్టివేస్తూ ‘మిస్సెస్ నిహా’ అంటూ తొలి పోస్ట్ పెట్టి కాబోయే భర్త డీటెయిల్స్ చెప్పింది. డిసెంబర్ లో వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు. దీంతో పెళ్లి రెండు నెలలే వుండటంతో వర్కవుట్లు చేస్తూ నానా హంగామా చేస్తోందీ మెగా డాటర్. పెళ్లి దగ్గర పడుతుండటంతో తన ఫ్రెండ్స్కి ఇటీవలే అదిరిపోయే బ్యాచిలరట్టీ పార్టీ ఇచ్చేసింది. ఈ ఫోటోలను నిహారికనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి.

Niharika Konidela Goa hot sexy images

అయితే ఈ గోవా ట్రిప్‌కి నిహారిక భర్త చైతన్య కూడా వెళ్లడా? లేక కేవలం స్నేహితురాళ్ళతో ఆమె టూర్ వేసిందా అనేది తెలియరాలేదు కానీ.. ప్రస్తుతం గోవాలో మెగా డాటర్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు మాత్రం నెట్టింట హంగామా చేస్తున్నాయి. మరీ ఇంత హాటుగా ఘాటుగానా? అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయ్. అయితే బ్యాచిలర్ పార్టీ అంటే ఆమాత్రం లేకపోతే మజా ఏం ఉంటుందిలే! అని వాళ్లే కూనిరాగాలు తీస్తున్నారు.